29.3 C
Hyderabad
Sunday, March 1, 2026
spot_img

జన హృదయ నేత నవీన్ పట్నాయక్ విజయాలు

      ఒడిశా ….ఈ పేరు వినగానే వెంటనే గుర్తుకువచ్చేది నవీన్ పట్నాయక్. ఒడిశాలో తిరుగులేని నాయకుడిగా నవీన్ పట్నాయక్ పేరు తెచ్చుకున్నారు. న‌వీన్ ప‌ట్నాయ‌క్ 1946 అక్టోబ‌రు 16న క‌ట‌క్ న‌గ‌రంలో జ‌న్మించారు. ఉన్నత చదువు లు చదివారు. నవీన్ పట్నాయక్‌కు సాహిత్యం అంటే బాగా ఇష్టం. వేలాది పుస్తకాలు చదివారు. చదవడమే కాదు నవీన్ రచయిత కూడా. అనేక పుస్తకాలు రాశారు. అంతేకాదు నవీన్‌కు లలిత కళలన్నా ఇష్టమే. ఆయిల్ పెయింటింగ్‌లను బాగా ఇష్టపడతారు. ఆయన నివాసంలో దేశ, విదేశాలకు చెందిన పెయింటింగ్‌లు కనిపిస్తాయి. నవీన్ పట్నాయక్ తండ్రి బిజూ పట్నాయక్ ఒడిశా రాజకీయాల్లో తిరుగులేని నేత. ఆధునిక ఒడిశా రూపకర్తగా బిజూ పట్నాయక్‌ను పేర్కొం టారు. ఈ నేపథ్యంలో తండ్రి బిజూ పట్నాయక్ వారసుడిగా నవీన్ పట్నాయక్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తండ్రి పేరు తో బిజూ జనతాదళ్ పార్టీని ఏర్పాటు చేశారు నవీన్ పట్నాయక్. ఇంకేముంది. ..ఒడిశా రాజకీయాల్లో బిజూ జనతా దళ్ జైత్రయాత్ర మొదలైంది. ప్రతి ఎన్నికలోనూ గెలవడం బిజూ జనతాదళ్‌కు సర్వసాధారణం అయింది.

     2000 సంవత్సరం మార్చి ఐదో తేదీన తొలిసారి ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు నవీన్ పట్నాయక్. ప్రజల సమస్యల పరిష్కారానికి టాప్ ప్రయారిటీ ఇచ్చారు నవీన్. అనుక్షణం ప్రజల కష్టాలను తీర్చడానికే ప్రయత్నిం చారు. ముఖ్యమంత్రి పదవి అప్పగించిన రాష్ట్ర ప్రజలకు సేవ చేయడమే పరమా వధిగా వ్యవహరించారు. నవీన్ పట్నాయక్ లోని ఈ చిత్తశుద్ధి, ఒడిశా ప్రజలను కట్టిపడేసింది. అప్పటి నుంచి ఒడిశా రాజకీయాల్లో బిజూ జనతాదళ్ ఒక బలమైన రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. శాసనస భకు ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ప్రజలు బిజూ జనతాదళ్‌కు పట్టం కట్టడం మొదలైంది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతా దళ్‌ ఘన విజయం సాధించింది. దీంతో 2004 మే16న రెండోసారి ముఖ్యమంత్రి గా నవీన్ పట్నాయక్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ తరువాతికాలంలో కూడా బిజూ జనతాదళ్ దూకుడు తగ్గలేదు. 2009 ఎన్నికల్లో కూడా బిజూ జనతాదళ్‌కు ప్రజలు పట్టం కట్టారు. అదే ఏడాది మే 21న మూడోసారి ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ప్రమాణస్వీకారం చేశారు. ఒడిశా రాజకీయాల్లో నవీన్ పట్నాయక్ దూకుడు తగ్గలేదు. ఆ తరువాత 2014లో జరిగినశాసనసభ ఎన్నికల్లో కూడా బిజూ జనతాదళ్ ఘన విజయం సాధించింది. దీంతో 2014 మే 21న నాలుగోసారి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌ స్వీకారం చేశారు. ఇప్పటికీ నవీన్ పట్నాయకే ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

       సహజంగా ఒడిశాకు ప్రకృతి విపత్తులు ఎక్కువ. 2013 అక్టోబరులో వచ్చిన ఫైలాన్ తుఫాను ఒడిశాను అతలాకు తలం చేసింది. తుఫాను కారణంగా భారీ ఎత్తున ఆస్తినష్టం జరిగింది. ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. దాదాపు 10 ల‌క్ష‌ల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించింది. దీనికిగానూ, నవీన్ పట్నాయక్ ఐక్యరాజ్యసమితి ప్రశంసలు అందుకున్నారు. జాతీయస్థాయిలో రెండు ప్రధాన రాజకీయ శిబిరాలు న్నాయి. ఒకటి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి కాగా రెండోది కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమి. అయితే నవీన్ పట్నాయక్ నాయక త్వంలో బిజూ జనతాదళ్‌ ఏ కూటమిలోనూ లేదు. ఇటు ఎన్డీయే అటు యూపీఏ కూటమి… రెండిటికీ సమానదూరంలో ఉంది. జాతీయ రాజకీయాలపట్ల నవీన్ పట్నాయక్ ఏనాడూ ఆసక్తి చూప లేదు. ఒడిశా ప్రయోజనాలే తమకు ముఖ్యమంటారు నవీన్ పట్నాయక్. నవీన్ పట్నాయక్ అవివా హితుడు. ఒడిశా ప్రజలే తన కుటుంబం అంటుంటారు నవీన్‌ నవ్వుతూ. ఏమైనా ఒడిశా ప్ర‌యోజ‌నాల కోస‌మే ప‌నిచేసే వ్య‌క్తిగా ప్ర‌జ‌ల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. అంతేకాదు తాజా సర్వే ద్వారా భారతదేశం లోనే అత్యంత ప్రజాదరణగల ముఖ్యమంత్రిగా పేరు నమోదు చేసుకున్నారు నవీన్ పట్నాయక్.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్