ఉస్మానియా పీజీ గర్ల్స్ హాస్టల్‌లో కలకలం రేగింది. హాస్టల్ బాత్‌రూమ్‌లో ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. ఇద్దరి లో ఓ వ్యక్తిని పట్టుకుని కట్టేశారు విద్యార్థినులు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ చేరుకుని నిందితు డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తమకు రక్షణ లేదంటూ విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్క రించాలంటూ హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు.