అక్రమార్జనలో పట్టుబడిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంపై ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. కస్టడీ విచారణ సమయంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పేరును శివబాలకృష్ణ చెప్పడంతో.. అతడిని విచారించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయ సలహాతో నోటీసులు జారీ చేసి విచారించడానికి సిద్ధమవుతోంది ఏసీబీ.
ఒక ఐఏఎస్ అధికారి అండదండలతో … అనుమతులు జారీ చేసి శివబాలకృష్ణ కోట్ల రూపాయలు గడించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని విచారణలో శివబాలకృష్ణ అంగీకరించినట్లు తెలుస్తోంది. పలు స్థిరాస్తి సంస్థలకు అనుమతులు మంజూరు చేసినందుకు లభించిన సొమ్ములో ఐఏఎస్ వాటాను తానే స్వయంగా తీసుకెళ్లి అప్పగిం చినట్లు రిమాండ్ రిపోర్టులో వాంగ్మూలంలో బహిర్గతం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారి మధ్య వాట్సప్ సంభాషణలు జరిగాయని, అక్రమార్జనను ఆస్తులుగా మార్చుకునేందుకు బినామీలతోనూ సంభాషించినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. అయితే భూములు కొని రిజిస్ట్రేషన్ చేసిన సమయంలో బినామీలు అక్కడే ఉన్నట్లు నిరూపించాల్సిన అవసరం ఏసీబీ ముందుంది. అలాగే ఐఏఎస్ అధికారికి వాటాల సొమ్మును శివబాలకృష్ణ స్వయంగా ముట్టజెప్పిన సమ యంలోనూ ఇద్దరూ ఒకే చోట ఉన్నట్లు తేల్చాల్సి ఉంది. సెల్‌ఫోన్ ల డేటాను వడపోసే పనిలో అధికా రులు నిమగ్నమయ్యారు. ఈ మేరకు కేసును ప్రాసిక్యూషన్ చేసేందుకు ప్రభుత్వ అనుమతులను అధి కారులు తీసుకోనున్నారు. స్వాధీనం చేసుకున్న ఫోన్స్, ల్యాప్‌టాప్‌లను అధికారులు ఫోరెన్సిక్ పంపిం చారు. వాట్సాప్, కాల్స్ డేటా రిట్రైవ్ చేసిన తర్వాత వచ్చిన డేటాతో దర్యాప్తు వేగవంతం చేయనుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ని 161 నోటీసులు ఇచ్చి వివరాలు సేకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బినామిలు, వెన కుండి నడిపించిన అధికారులు, రాజకీయ ప్రముఖుల చిట్టాను ఏసీబీ త్వరలో బట్టబయలు చేయ నుందని తెలుస్తోంది.


