33.3 C
Hyderabad
Sunday, March 1, 2026
spot_img

ఉద్యోగులపై అద్దె కార్ల యజమానుల గూండాగిరి

      లాంగ్ డ్రైవ్ కార్స్.. ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికీ కార్లను అద్దెలకు అందించే సంస్థ అనే విషయం గుర్తొస్తుంది. కారు కొనే ముందు, అదే మోడల్ అద్దె కారులో… ఉల్లాసంగా, ఆహ్లాదంగా టెస్ట్ డ్రైవ్.. లాంగ్ డ్రైవ్ వెళ్లే వారు ఎందరో. వ్యాపారం ముసుగులో లాంగ్ డ్రైవ్ కార్స్ నిర్వాహకులు గూండాగిరికి దిగితే.. ఆ పరిస్థితే ఊహించలేం కదూ.. అలా గూండా గిరికి, రౌడీ చేష్టలకు దిగిన లాండ్ డ్రైవ్ కార్స్ యజమాని ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగులను అక్ర మంగా బంధించి వేధించిన ఘటన పోలీసులనే నివ్వెరపరచింది.

      హైదరాబాద్ వంటి మహా నగరానికి వచ్చే పర్యాటకులు అద్దెకు కార్లను తీసుకోవడం సర్వ సాధారణం. అద్దెకు కార్లను అందించే లాంగ్ డ్రైవ్ కార్స్ నిర్వాహకుల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తమతో పనిచేసిన ఉద్యోగులనే, అక్రమంగా బంధించి చితక బాదిన ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. చేస్తే తమ దగ్గర ఉద్యోగం చేయాలి లేదంటే చావు దెబ్బలు తినాలి..ఇదే లాంగ్ డ్రైవ్ కార్స్ సంస్థల తీరు. ఉద్యోగం పేరుతో అభం శుభం తెలియని యువతులను మభ్యపెట్టి లోబర్చుకున్న ఉదంతాలు లేకపోలేదు. అడ్డు చెబితే వేధింపులు చిత్రహింసలు, యువకుల పరిస్థితి మరీ దారుణం. మాట వినకపోతే చచ్చేటట్లు కొడతారు. బాధితులు బయటకు వచ్చి చెప్పటానికి భయంతో వణికిపోతున్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.. అర్ధంచేసుకోవచ్చు. లాంగ్ డ్రైవ్ కార్స్ యజమాని కొప్పుల హరిదీప్ రెడ్డి నిర్వాకం చూసి పోలీసు ఉన్నతాధికారులు కూడా షాక్ అవుతున్నారు.

      లాంగ్ డ్రైవ్ కార్స్ మేడి పల్లి బ్రాంచ్ లో డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ గా పనిచేస్తున్న ఉద్యోగులు కొందరు జీతాలు సరిపోక ఉద్యోగాలకు బంద్ పెట్టారు. అలా లాంగ్ డ్రైవ్ కార్స్ నుంచి బయటకు వచ్చిన ఉద్యోగులు తామే సొంతంగా స్టార్టప్ కు ప్లాన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న లాంగ్ డ్రైవ్స్ కార్ ఓనర్ కొప్పుల హరిదీప్ రెడ్డి. ఆగ్రహంతో రగిలి పోయాడు. గత ఉద్యోగులంతా కొత్తగా స్టార్టప్ పెడుతున్నారని, అందుకు సంబంధించిన సమావేశం జరుగుతుంది అని తెలిసి.. దాదాపు ముప్పై మంది అనుచరులతో కలిసి గూడాగిరీకి దిగాడు. దాదాపు 8 మంది ఉద్యోగులపై దాడికి తెగబ డ్డారు. వారందరినీ అక్రమంగా నిర్బంధించి… తమ కార్లలోనే.. మేడిపల్లిలో పలు ప్రాంతాలు తిప్పుతూ రాత్రి రెండు, మూడు గంటల వరకు ఇష్టం వచ్చినట్లు చేతికి దొరికిన వస్తువులతో చితకబాదారు. వారిలో యువతులు, యువకులు ఉన్నారు. వారందరినీ నిర్బంధించి కొట్టారు. వారిలో తేజ అనే యువకుడి ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. గూండా యజమాని చెరనుండి బయటపడిన వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల రోదన వర్ణనాతీతం. దాడిలో తీవ్రం గా గాయపడిన వారిని చూసి వైద్యులే షాక్ అయ్యారు. ఘటన అనంతరం ఆ యువతీ యువకులు తమపై జరిగిన దాడిపై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా ప్రస్తుతం లాంగ్ డ్రైవ్ కార్స్ ఓనర్ హరిదీప్ రెడ్డితోపాటు.. దాడికి తెగబడిన నిందితులు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, అసలు దాడికి గురైన వారిలో తేజ అనే యువకుడి ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవ డంతో కుటుంబ సభ్యులు భయాందోళ చెందుతున్నారు.

       బాధితుల కథనంతో లాంగ్ డ్రైవ్ కార్స్ నిర్వాహకుల చీకటి బాగోతాలను వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగం ఆశచూపి… అమ్మాయి బాగుంటే విద్యార్హత తో పని లేకుండా ఉద్యోగమిచ్చి ఆ తరువాత లోబ రుచుకునే ప్రయత్నం చేస్తారట. అడ్డు చెబితే లైంగిక వేధింపులకు గురిచేస్తారని బాధితులు వాపోయారు. జాబ్ లో జాయిన్ అయిన కొన్నాళ్ళకే లాంగ్ డ్రైవ్ కార్ ఓనర్ కొప్పుల హరిదీప్ రెడ్డితోపాటు అతని అనుచరులు అమ్మాయిలతో లాంగ్ టూర్లు ప్లాన్ చేసి మద్యం తాగించి, ఆ తరువాత వారిని టార్చర్ చేస్తా రని భయంకర వాస్తవాలు బయట పెట్టారు బాధితులు. కొప్పుల హరిదీప్ రెడ్డి రాజకీయంగా బలంగా ఉండడంతో తమకు ప్రాణహాని తలపట్టవచ్చని బాధితులు ఆవేదన చెందుతున్నారు. కొప్పుల హరిదీప్ రెడ్డితోపాటు దాడికి తెగబడిన అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని బాధితులు కోరుతు న్నారు. తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసులు కంటితుడుపు చర్యగా ఏదో కేసు పెట్టా మని చెపుతున్నారు. సమగ్ర దర్యాప్తు జరిపితే లాంగ్ డ్రైవ్ యాజమాన్యం అరాచకాలు వెలుగు లోకి వస్తా యని అంటున్నారు బాధితులు. పోలీసులు వెంటనే స్పందించి వారిని అరెస్ట్ చేయడం తోపాటు, జాడ తెలియకుండా పోయిన తేజను రక్షించాలి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్