శతాబ్దాల హిందువుల కల నేడు సాకారం కాబోతోంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు సర్వం సిద్ధ మైంది. మరికొద్ది గంటల్లో రామ మందిరం ప్రాణ ప్రతిష్ట వేడుక సాక్షాత్కరించబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య లో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. వేడుకగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ప్రాణప్రతిష్ట వేడుకకోసం భారత్ తో పాటు యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గర్బగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన మధ్యాహ్నం 12.20 నుంచి 1 గంట మధ్య జరుగుతుంది.
బాల రాముడి ప్రాణపత్రిష్ఠాపన మహోత్సవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నేడు అయోధ్యలో రామయ్య కొలువుదీరుతున్నాడు. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. అభిజిల్లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జరుగుతోంది. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగియనుంది.
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సరిగ్గా మధ్యాహ్నం 12.05 గంటలకు ప్రారంభమై 12.55కు ముగుస్తుంది. అయితే, రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠకు మధ్యాహ్నం 12:29 నిమిషాల 08 సెకన్ల నుంచి 12:30 నిమిషాల 32 సెకన్ల వరకు కేవలం 84 సెకన్లు మాత్రమే శుభ సమయం. మృగశిర లేదా మృగశీర్ష నక్షత్రాన అభిజిత్ లగ్నంలో రామ్‌లల్లా విగ్రహ స్థాపన జరుగు తోంది. ఈ మహాక్రతువును కాశీకి చెందిన ప్రముఖ వేద ఆచార్య గణేశ్వర్ ద్రవిడ్, ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలో 121 మంది వేద ఆచార్యులు, రుత్విజులు నిర్వహిస్తారు. ఈ మహోత్సవానికి దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు, స్వామీజీలు వేలాదిగా తరలివచ్చారు. అయోధ్యలో ఎటుచూసినా రామనామాన్ని జపిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిర్వహించే ప్రాణప్రతిష్ఠలో కర్తలకు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటల ను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు వేల సంఖ్య పాల్గొంటున్నా రు. రామ మందిర ప్రారంభోత్సవానికి 7 వేల మంది అతిథులను ఆహ్వానించారు. వారిలో 506 మంది అత్యంత ప్రము ఖులున్నారు. సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖుల హాజరైయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో పాటు వ్యాపార వేత్త అనిల్ అంబానీ తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బహుళ అంచెల భద్రత కోసం వేల మంది పోలీసులను మోహరించింది. ప్రతి వీధిలో బారికే డ్లను ఏర్పాటు చేసింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించింది. ఎటువంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంట నే స్పందించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. భక్తులకు, ఆహ్వానితులకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే చికిత్స అందించేలా బెడ్లను సిద్ధం చేశారు. ఎయిమ్స్ నుంచీ ప్రత్యేక వైద్య బృందాలను రప్పించారు.
అయోధ్య రాముడి ఆలయాన్ని ఎన్నో ప్రత్యేకతలతో నిర్మించారు. వెయ్యేళ్లకుపైగా చెక్కుచెదరకుండా ఉండేలా, శక్తివంతమైన భూకంపాలను సైతం తట్టుకునేలా ఆలయాన్ని కట్టారు. వీటితోపాటు ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. ప్రతీ సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఒక అద్భుతం చోటు చేసుకోనుంది. గర్భగుడిలో ఉన్న శ్రీరాముడి విగ్రహం నుదిటిపై సూర్యూడి కిరాణాలు ప్రసరించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. కోట్లాది మంది హిందువుల కల సాకారమవుతున్న వేళ అయోధ్య మందిరంలో ఏర్పాటు చేస్తున్న సూర్య తిలకం విశిష్టతలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
రామాలయ నిర్మాణంలో భాగంగా ఏటా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్యలో మహా అద్భు తం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు మొదలు కానున్న ఈ ప్రక్రియ 6 నిమిషాల పాటు కొనసాగనుంది. ఈ 6 నిమిషాల పాటు గర్భగుడిలోని శ్రీరాముడి విగ్రహ నుదుటిపై సూర్య కిరణాలు ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీన్నే రాముడికి సూర్య తిలకంగా ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రత్యేక టెక్నాలజీని సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ -సీబీఆర్ఐ రూపొందించింది. ప్రాణప్రతిష్ఠ వేడుక ముగిశాక.. హారతి కార్యక్రమంలో భక్తులు పాల్గొనేందుకు ఆలయ ద్వారాలు తెరుస్తారు. మందిరంలో మూడు రకాల హారతులు నిర్వహిస్తారు. రోజూ ఉదయం 6.30, మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి 7.30 గంటలకు మూడు హారతులు నిర్వహించ నున్నారు.


