సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘంలో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో మాజీమంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు 11 గంటలు అయినా రాకపోవ డంతో హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో రైతు భరోసా చెల్లించాలని సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. ఖాళీగా ఉన్న పాఠశాల గదుల్లో అంగన్ వాడికి కేటాయిం చాలని,విద్యార్థులకు ఏకరుప దుస్తులను పంపిణీ చేయాలని తీర్మానం జరిగింది. 227 గ్రామ పంచాయితీ సఫాయి కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించాలని సమావేశంలో తీర్మానించారు.