అంతమంది మహిళా పోలీసులు తన మీద పడుతుంటే ఆవేశం రాదా? ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటే ఎలా? అందుకే చేయి చేసుకోవాల్సి వచ్చిందని ఏపీ సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ క్లారిటీ ఇచ్చారు. తాను నిజంగా పోలీసులను కొట్టాలనుకుంటే దండిగా కొట్టొచ్చన్నారు. తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతున్న తన కూతురు షర్మిలను పదే పదే ఎందుకు పోలీసులు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కాగా అంతకుముందు పోలీసులపై షర్మిల చేయి చేసుకోవడంతో ఆమెను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. షర్మిలను పరామర్శించేందుకు వచ్చిన విజయమ్మను మహిళా పోలీసులు అడ్డుకోవడంతో ఓ కానిస్టేబుల్ పై ఆమె చేయి చేసుకున్నారు. మరోవైపు స్టేషన్ లో ఉన్న షర్మిలను ఆమె భర్త బ్రదర్ అనిల్ పరామర్శించారు.