ఏపీలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక విద్యుత్ చార్జీలు పెంచడమేనా? అంటూ వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ప్రశ్నించారు. వచ్చే ఐదేళ్లు కరెంట్ చార్జీలు పెంచమంటూ ఎన్నిలక ముందు ఇచ్చిన హామీ ఏమైందంటూ వైఎస్ జగన్ నిలదీశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానం గుర్తుచేస్తున్నా అంటూ వీడియో షేర్ చేశారు.