21.7 C
Hyderabad
Wednesday, March 12, 2025
spot_img

గుండెపోటుతో మరో కన్నడ నటుడు మృతి.. చిత్ర సీమలో విషాదం

స్వతంత్ర వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు. రోజురోజుకి ఈ సంఖ్యా పెరుగుతూనే ఉంది. కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌ మొదలు ఫిబ్రవరిలో కన్నుమూసిన తారకరత్న వరకు గుండెపోటు బాధితులే. ఇప్పుడు మరో యువ నటుడు గుండె పోటుతో మరణించాడు. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నితిన్‌ గోపీ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. అతని వయసు కేవలం 30 సంవత్సరాలే కావడం గమనార్హం. ఛైల్డ్‌ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయమైన నితిన్‌ గోపీ దిగ్గజ నటుడు డాక్టర్‌ విష్ణు వర్ధన్‌తో కలిసి హలో డాడీ అనే సినిమాలో నటించాడు. ఇందులో విష్ణు వర్ధన్‌ కుమారుడి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముత్తినంత హెంతి, కేరళిద కేసరి, నిశ్శబ్ధ, చిరబండవ్య వంటి సినిమాల్లో కూడా నితిన్‌ నటించారు. భక్తి సీరియల్‌ హర హర మహాదేవ్‌లో కొన్ని ఎపిసోడ్స్‌లో కూడా కనిపించారు. కన్నడ, తమిళ్‌ భాషల్లో సూపర్‌హిట్‌గా నిలిచిన కొన్ని ధారావాహికల్లోనూ నటించి మెప్పించారు. కాగా ప్రముఖ భక్తి సీరియల్ హర హర మహాదేవ్‌లో కొన్ని ఎపిసోడ్స్‌లో కనిపించాడు నితిన్‌. ఇటీవల ‘ధృవ నక్షత్రం’ సీరియల్‌కి దర్శకత్వం వహించారు కూడా. మరో కొత్త సీరియల్‌ను తెరకెక్కించేందుకు కూడా సిద్ధమయ్యాడు. అయితే శుక్రవారం రాత్రి హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందూతూ నితిన్‌ తుది శ్వాస విడిచారు. యువనటుడి అకాల మరణంతో శాండల్‌వుడ్‌ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు, అభిమాన్లు నితిన్‌ ఫ్యామిలీకి సంతాపం ప్రకటించారు.

Latest Articles

కొక్కొరో కో అని అందరినీ నిద్ర లేపే కోళ్లకు కొక్కెర వ్యాధి – నానక్ నగర్ లో శాశ్వత నిద్రలోకి పన్నెండు వేల కోళ్లు

తెల్లవారక ముందే పల్లె లేస్తుంది. ఈ పల్లెను ప్రభాత సమయంలో కొక్కొరోకో పిలుపులతో మేలుకొలుపు పలికేవి కుక్కుటాలు. అందరిని తెల్లవారుజామునే నిద్ర లేపే గురుతర బాధ్యతలు తీసుకుని, విశిష్ట సేవలు అందిస్తున్న...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్