27.2 C
Hyderabad
Thursday, February 5, 2026
spot_img

ఏపీలో ఎగిరిన పసుపు జెండా

టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ఫుల్ స్వింగ్ లోకి వచ్చేశారు. 2019లో ఏపీలో అధికారాన్ని కోల్పోయిన టీడీపీ 2024 వచ్చే సరికి కూటమి కట్టి మళ్లీ పవర్‌లోకి వచ్చిందంటే అందులో చంద్రబాబు చాణక్యమే దాగుందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అపర చాణక్యుడిగా రాజకీయాల్లో పేరుతెచ్చుకున్న చంద్రబాబు మళ్లీ జాతీయ రాజకీ యాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు.

   ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది. ప్రధానంగా సైకిల్ యమా స్పీడుగా తిరిగింది. అయితే 2019లో కేవలం 23 సీట్లకే పరిమితమైన టీడీపీ ఇప్పుడు మళ్లీ అధికారం అందుకుందంటే అందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాణక్యమే కారణమని చెప్పక తప్పదు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం వెక్కిరించినా, రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా ఏ మాత్రం వెనుకంజ వేయలేదు చంద్రబాబు. సరికదా 70 ఏళ్లకు పైబడిన వయసులోనూ పార్టీని మరింత హుషారుగా ముందుకు నడిపారు. చివరకు స్కిల్ స్కాంలో చిక్కుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా పార్టీని మరింత క్రియాశీలంగా ముందుకు నడిపారు. జనసేన, బీజేపీతో పొత్తులు కుదుర్చు కోవడంతోపాటు సీట్ల సర్థుబాటులో తనదైన మార్కు ప్రదర్శించారు.

   ఓవైపు వైసీపీ అంగ, అర్థ బలం ఉన్ననాయకుల్ని బరిలో దింపినా ఏ మాత్రం వెనుకంజ వేయకుండా, అధైర్యపడ కుండా తాను నమ్మిన వ్యక్తులకే టికెట్లు ఇచ్చారు టీడీపీ అధినేత. ఈ క్రమంలో జనసేన, బీజేపీలోని అభ్యర్థులను సైతం చాలాచోట్ల చంద్రబాబే డిసైడ్ చేశారని చెప్పడంలో ఏ మాత్రం అతి శయోక్తిలేదు. దీంతో ఇది కూటమికి ప్లస్‌గా మారింది. ప్రధానంగా వైసీపీ పాలనలో అభివృద్ధి లేదని, గతం లో తాను తెచ్చిన పరిశ్రమలు ఏపీ నుంచి వెళ్లిపోడానికి ప్రధాన కారణం జగన్, వైసీపీయేనని ప్రజల దృష్టికి తీసుకువెళ్లడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సక్సెసయ్యారు. అటు మొదట్లో అమరావతిని రాజధానిగా అంగీకరించిన వైసీపీ, జగన్‌ ఆ తర్వాత మాట మార్చారని, తాము వస్తే మళ్లీ అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. పైగా ఇప్పటికే ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా ఉందన్న విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చంద్రబాబు కారణంగానే మరోసారి రాష్ట్రం అభివృద్ధి చెందుతుం దని ప్రజలంతా నమ్మారు. దీంతో ఏకపక్షంగా కూటమికి ఓట్లు వేశారు. దీనికితోడు ప్రజల అభివృద్ధి కోసం ఆకర్షణీయ మైన మేనిఫెస్టో రూపొందించడంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటు సంక్షేమంతోపాటు అటు అభివృద్ధి ఉండేలా బ్యాలెన్స్ చేస్తూ మేనిఫెస్టో రూపొందించారు. అటు ఏపీకి సీఎం కావడంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లోనూ టీడీపీ గణనీయమైన సంఖ్యలో సీట్లు సాధించడంతో జాతీయ రాజకీయాల్లో నూ మరోసారి చక్రం తిప్పనున్నారు చంద్రబాబు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్