రాజకీయ లబ్ది కోసమే పించన్ లబ్దిదారులను మండుటెండల్లో నిలబెట్టారని మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా. సీఎం జగన్ కనుసన్నల్లోనే సీఎస్ పనిచేశారని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దరించాలనే కార్యక్రమంలో భాగంగా పెన్షన్ల పేరుతో కుట్రలు చేశారని విమర్శిం చారు. ఎండలున్నాయి, వృద్ధులు పడిగాపులు కాసి మరణించే అవకాశాలున్నాయని మెజార్టీ కలెక్టర్లు హెచ్చరించినప్పటికీ..సెర్ఫ్ సీఈఓ, ఇతర ఉన్నతాధికారులు కలిసి పెన్షన్ల నాటకమాడారని చెప్పారు. ఇద్దరు వృద్ధుల మరణానికి కారణం జగన్ ప్రభుత్వ నిర్ణయాలే అని దేవినేని ఉమా తెలిపారు.