గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఓడిపోవడంతో అధికార వైసీపీ అప్రమత్తమైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు విప్ జారీ చేసింది ఆ పార్టీ. ఈనెల 23వ తేదీన ఎమ్మెల్యే కోటా ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ నెల 20న అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలందరూ తప్పకుండా హాజరుకావాలని.. 23వ తేదీ పార్టీ సూచించిన అభ్యర్థికి ఓటు వేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు విప్ జారీ చేశారు. ఎమ్మెల్యేల్లో ఎవరైనా విప్ ధిక్కరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అటు టీడీపీ కూడా తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. పార్టీ శాసనసభ్యులందరూ తమ అభ్యర్థి పంచమర్తి అనురాధకు ఓటు వేయాలని ఆదేశించింది.