ఏపీ సీఎం జగన్ కాసేపట్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నిన్న ఒక రోజు బ్రేక్ తీసుకున్న జగన్ ఇవాళ మళ్లీ రాష్ట్రాన్ని చుట్టేయనున్నారు. మండుటెండలను లెక్క చేయకుండా ముఖ్యమంత్రి ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తు న్నారు. వైసీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని తన భుజాలపై వేసుకుని పర్యటిస్తున్నారు. జగన్‌కు కూడా జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఇవాళ ఉదయం పది గంటల నుంచి జగన్ ప్రచారం ప్రారంభంకానుంది. నేడు మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచారం నిర్వహిస్తారు. నరసాపురం, నరసరావుపేట, ఒంగోలులో సభలకు హాజరవుతారు. వైసీపీకి ఎందుకు ఓట్లు వేయాలో ప్రజలకు వివరించనున్నారు. ఉదయం 10 గంటలకు నరసాపురంలో జరగ నున్న సభలో ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30కి నరసరావుపేటలోని పెదకూరపాడులో సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు కనిగిరిలోని పామర్రు ప్రచారసభలో ప్రసంగిస్తారు జగన్.


