స్వతంత్ర వెబ్ డెస్క్: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో రసవత్తర పోరు జరగనుంది. నిన్న శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ జరగగా… ఇవాళ చిన్న జట్లు అయినా నెదర్లాండ్స్ మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పోరు జరగనుంది. లక్నో లోని భారతరత్న శ్రీ అటల్ బీహార్ వాజ్పేయి క్రికెట్ స్టేడియంలో ఈ బిగ్ ఫైట్ జరగనుంది. ఎప్పటిలాగే మధ్యాహ్నం రెండు గంటల సమయంలో… నెదర్లాండ్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ జత మధ్య మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో అంచనాలకు మించి నెదర్లాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్టు రాణిస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద జట్లైన శ్రీలంక, పాకిస్తాన్ లాంటి వాటిని కూడా మట్టి కల్పించాయి నెదర్లాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్. అలాంటి ఈ రెండు జట్ల మధ్య ఇవాళ పోరు జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుకు సెమీ స్ ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఓడిపోతే ఒక జట్టు కచ్చితంగా ఇంటికి వెళ్తుంది. మొత్తానికి ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. అలాగే మొదట టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ చేస్తే విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.