MLA Chinnaiah |మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. దుర్గం చిన్నయ్య పై అరిజన్ పాల డెయిరీ భాగస్వామీ శేజల్ పలు ఆరోపణలు చేశారు. తనకు అమ్మాయిలు కావాలని, వారిని పంపాలంటూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమపై ఒత్తి డి తెచ్చారని శేజల్ ఆరోపించారు. తరచూ ఎదో విధంగా వార్తల్లో ఉండే ఎమ్మెల్యే పై ఓ మహిళ చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియా లో కలకలం రేపుతున్నాయి. సబ్సిడీ, రుణ పద్ధతిలో గేదెలు, ఆవులు ఇస్తామని జిల్లా పాడి రైతులకు టోకరా వేసిన ఓ ప్రైవేటు డెయిరీ నిర్వహకులతో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు వివాదాస్పదమవు తోంది. తనకు అమ్మాయిలు కావాలని వారిని పంపాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమపై ఒత్తి డి తెచ్చారని ఆరిజిన్ డెయిరీ డైరెక్టర్ శేజల్ ఆరోపించారు.
ఆమె ఓ ఆడియో, వీడియో విడుదల చేశారు. బెల్లంపల్లిలో డెయిరీ ఏర్పాటు చేసేందుకు తాము ఎమ్మెల్యేను కలిశామని చెప్పారు. అందులో తనకు సంబంధించిన వారికి వాటా కావాలని ఎమ్మెల్యే కోరారని అన్నారు. దానికి తాము అంగీకరించామన్నారు. అంతేకాకుండా, తన కోర్కెలు తీర్చాలని వేధించడంతో బ్రోకర్ల ద్వారా హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కు అమ్మాయిలను పంపించినట్టు వెల్లడించారు.
ట్యాబ్లె ట్లు కావాలి, రిలాక్సేషన్ పొందాలి, ఆ అమ్మాయి ఉందా.. ఎంజాయ్ బాస్ అంటూ సాగిన సీక్రెట్స్ కోడ్ వాట్సప్ సంభాషణల్లో అనేక కోణాలు బయటపడుతున్నాయి. పలుమార్లు హైదరాబాద్ లోని లోకేషనున్ల షేర్ చేసుకోవడం, కోడ్ భాషలో చాటింగ్ మొదలైనవి అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఆ చాటింగ్ లో ప్రజాప్రతినిధి అమ్మాయిల గురించి ఆరా తీయడం, ఆ నిర్వాహకుడు తన స్టాఫ్ కాకుం డా బయట వాళ్లతో ఎంజాయ్ చేయాలంటూ చాటింగ్ చేయడం ఒకింత విస్మయానికి గురి చేస్తున్నాయి.
ఈ విషయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(MLA Chinnaiah) స్పందిస్తూ ఆరిజిన్ డెయిరీ నిర్వాహకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సబ్సిడీపై గేదెల యూనిట్లు ఇస్తామని రైతుల దగ్గర 3 లక్షల చొప్పున వసూలు చేశారని యూనిట్లు ఇవ్వకుండా రైతులను మోసగించారని అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాట్సాప్ చాటింగ్‌లతో తనకు సంబంధం లేదని దుర్గం చిన్నయ్య తెలిపారు.