Free Porn
xbporn
22.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

లోకల్ బాడీ ఎన్నిక‌ల‌కు రేవంత్ స‌ర్కార్ సిద్దం అవుతుందా..?

లోకల్ బాడీ ఎన్నిక‌ల‌కు రేవంత్ స‌ర్కార్ సిద్దం అవుతుందా..?  కుల‌గ‌ణ‌న కంటే.. ముందే  స్థానిక సంస్థల ఎన్నిక‌లు ముగించాల‌ని ప్రభుత్వం భావిస్తుందా.?  దీనికి ఓటర్ జాబితాను రెడీ చేస్తుందా.? బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే  స్థానిక ఎన్నికల నగరాను మోగించనుందా.. అంటే అవుననే సమాదానం వస్తోంది. తెలంగాణ‌లో లోక్ స‌భ ఎన్నిక‌లు ముగిసాయి..ఇక‌ ఇప్పుడు లోక‌ల్ బాడీ ఎన్నిక‌లు తెర‌లేవనుంది. ఇప్పుటికే అధికారుల పాల‌న‌లో పంచాయ‌తీలు కొన‌సాగ‌తున్నాయి. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీల  ప‌ద‌వీకాలం ముగిసింది. అంతేకాదు… జ‌న‌వ‌రితో మున్సీపాలీటీల ప‌ద‌వీకాలం ముగియ‌నుంది.. దీంతో  స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. స‌చివాల‌యంలో జ‌రిగిన పంచాయ‌తీ రాజ్  పై జ‌రిగిన సమీక్షలో.. సీఎం రేవంత్ రెడ్డి .. ఎన్నిక‌ల నిర్వహణపై , సాధ్యాసాధ్యాల‌పై చ‌ర్చించారు.

తెలంగాణ  వ్యాప్తంగా 12వేల 769 పంచాయ‌తీలు ఉన్నాయి. ఈ పంచాయ‌తీ ప‌ద‌వీకాలం ముగిసి ఆరు నెల‌లు కావస్తుంది. అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా… ఉన్న 32 జ‌డ్పీలు, 563 జ‌డ్పీటీసీలు, 6 వేల మంది ఎంపీటీసీల ప‌ద‌వీకాలం ముగిసి… నెల రోజులు గ‌డుస్తుంది. దీంతో… స్థానిక సంస్థలు పూర్తిగా అధికారుల పాల‌న‌లోకి వెళ్ళాయి. వీటికి ఎన్నిక‌లు నిర్వహించాల్సిన ప‌రిస్థితి. ఇంకా ఎన్నిక‌లు ఆలస్యం అయితే… కేంద్ర నుండి వ‌చ్చే నిధులు ఆగిపోతాయి. అదే జ‌రిగితే… పంచాయ‌తీల్లో  అభీవృద్ది కార్యక్రమాలు బ్రేకులు ప‌డి… పూర్తిగా పాల‌న కుంటుప‌డే అవ‌కాశం ఉంది. అందుకే లోకల్ బాడీ ఎన్నిక‌ల‌ను నిర్వహించడంపై దృస్టి సారించింది రేవంత్ స‌ర్కార్. అయితే… ఇప్పుడు ఈ ఎన్నిక‌ల‌కు కుల గణన అంశం అడ్డుగా ఉంది. దీంతో… కుల‌గ‌ణ‌న‌పై .. ఎలా వెళ్ళాలి… ఎన్నిక‌లను ఎప్పుడు నిర్వహించాలనేదానిపై లెక్కలేసుకుంటుంది ప్రభుత్వం

కాంగ్రేస్ త‌న ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో…. కుల‌గ‌ణ‌న చేస్తామ‌ని హామిచ్చింది. దామాషా ప్రకారం… బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌ని…హామీ ఇచ్చింది. దీంతో.. ఇప్పుడు బీసీలు కుల‌గ‌ణ‌న పై ఎంతో ఆశ పెట్టుకున్నారు. అయితే… ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కుల‌గ‌ణ‌న ప్రకియ చేప‌డితే… క‌నీసం ఐదు – ఆరు నెల‌లు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. దీంతో… అప్పటి వ‌ర‌కు ఆగితే… స్థానిక సంస్థలకు కేంద్రం నుండి వ‌చ్చే నిధులు ఆగిపోతాయి.  ఈ ప‌రిస్థితుల్లో … లోక్ బాడీ ఎన్నిక‌ల‌ను  సాధ్యమైనంత తొందరగా నిర్వహించాలని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి…. కొత్త ఓటర్ జాబితాను ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోగా పూర్తిచేయాలని.. దానికి అనుగుణంగా నిర్దిష్ట గడువులోగా నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్ కు సూచించారు. బీసీ కమిషన్ ఆధారంగానే ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనుంది సర్కార్.

మొత్తానికి స‌ర్కార్ కుల‌గ‌ణ‌న కాకుండా.. బీసీ  నివేదిక తర్వాత  ఎన్నిక‌లకు వెళితే…‌ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవ‌డంతో పాటు… లోక‌ల్ బాడిలో… పూర్తి స్థాయిలో బ‌లోపేతం అయ్యేలా… పాల‌క మండ‌లీల‌ను  ఏర్పాటు ప్రభుత్వం భావిస్తోంది. ఇవన్నీ పూర్తిచేసి  అక్టోబర్లో ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్