వచ్చే 3నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు సూచించారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన మంత్రులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు కీలక బాధ్యతలు తీసుకుని ప్రచారం చేయాలన్నారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం అమలుపై మంత్రులతో చర్చించారు. ఏప్రిల్‌లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని చెప్పారు.
కరెంట్ ఛార్జీలు పెంచేందుకు వీల్లేదని తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. అవకాశం ఉంటే కరెంట్ ఛార్జీలు తగ్గించాలని మంత్రి వర్గ భేటీలో చెప్పారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాలు వేగంగా అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. పాఠశాలలు తెరిచేనాటికి డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించారు.
క్యాబినేట్ భేటీ తర్వాత కొద్దిసేపు మంత్రులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. వచ్చే 3 నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు కీలక బాధ్యతలు తీసుకుని ప్రచారం చేయాలన్నారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ‘తల్లికి వందనం’ అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఏప్రిల్‌లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలన్నారు.