29.7 C
Hyderabad
Saturday, July 12, 2025
spot_img

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు అడ్డంకి ఎవరు?

కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులను ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? వారి గెలుపోటములకు ఎవరు అడ్డంకిగా ఉన్నారు? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుండటంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ ఎన్నికకు దూరంగా ఉంటోంది. సోమవారమే నామినేషన్ల గడువు కూడా ముగిసింది. ఇక అభ్యర్థులందరూ తమ ప్రచారాన్ని వేగవంతం చేయనున్నారు.

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇండిపెండెంట్లు కూడా గట్ట పోటీనే ఇస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని 45 అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుండటంతో అందరూ సీరియస్‌గా తీసుకున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో దీన్ని కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీ నాలుగు సీట్లు గెలిచింది. బీజేపీ గెలిచిన ఎనిమిది ఎమ్మెల్యే సీట్లలో ఏడు ఇక్కడే ఉన్నాయి. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే విధంగా సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది.

ఇటీవల కాలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే ఒక ప్రస్తావన తీసుకొని వస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ గెలవడం పక్కా.. అంటూ చెబుతున్న కేటీఆర్.. తన పార్టీ అభ్యర్థిని ఎందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బరిలోకి దింపలేదో మాత్రం చెప్పడం లేదు. పైగా ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోనే కేటీఆర్, కేసీఆర్, హరీశ్ రావు, కవిత నియోజకవర్గాలు ఉన్నాయి.పైగా ఇక్కడ బీఆర్ఎస్‌కు బలం ఎక్కువ అని చెప్పుకుంటారు. అయితే బీఆర్ఎస్ లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇస్తుండటంతో అభ్యర్థుల్లో దిగులు మొదలైంది.

కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం పరిధిలో సుమారు 3 లక్షల యాబై అయిదు వేల మంది ఓట్లు ఉన్నారు. ఇందులో 51 శాతం ఓట్లు వచ్చిన వారినే విజేతలుగా ప్రకటిస్తారు. అందుకే అభ్యర్థులందరూ మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేయాలని ప్రచారం నిర్వహస్తుంటారు. కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి అంజిరెడ్డి పోటీ చేస్తున్నారు. వీళ్లు గత కొన్నాళ్లుగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని సీరియస్‌గా చేపట్టారు. మరోవైపు స్వతంత్రులుగా ప్రసన్న హరికృష్ణ, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, శేఖర్ రావు తదితరులు ఉన్నారు. వాస్తవానికి ప్రసన్న హరికృష్ణ, రవీందర్ సింగ్, శేఖర్ రావులు బీఆర్ఎస్ తరపున టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే గులాబీ అధినేత ఎన్నికల్లో పోటీకి సుముఖంగా లేకపోవడంతో వీరు ముగ్గురూ ఇండిపెండెంట్లుగా బరిలోక దిగారు.

బీఆర్ఎస్ నేతలే స్వతంత్రులుగా ఉండటంతో ఇప్పుడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుబులు పట్టుకుంది. క్షేత్ర స్థాయిలో వీళ్లు కూడా తమ పరిచయాలతో ఓట్లను చీలుస్తారనే ఆందోళన నెలకొంది. ఇండిపెండెంట్లు భారీగా ఓట్లు చీలిస్తే ఎవరకి నష్టం జరుగుతుందని అంచనాలు వేసుకుంటున్నారు. ప్రచారానికి కేవలం రెండు వారాలే మిగిలి ఉండటంతో ఓట్లు చీలకుండా తమ వంతుగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు క్షేత్ర స్థాయిలో ప్రయత్నాలు మొదలు పెట్టారట. అధికార పార్టీ అభ్యర్థికి ఓట్లు వేస్తే రాబోయే రోజుల్లో పనులు జరుగుతాయని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారట. మరోవైపు బీజేపీ అభ్యర్థి కూడా అన్ని మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. పలు రకాల మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తూనే.. ఓటర్ల వద్దకు నేరుగా వెళ్లి ఓట్లు అడుగుతున్నారట. ఇంత రంజుగా సాగుతున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మరి అంతిమంగా విజేతగా ఎవరు నిలుస్తారో వేచి చూడాలి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్