18.7 C
Hyderabad
Wednesday, January 22, 2025
spot_img

WhatsApp: తెలియని నంబర్‌ను సేవ్ చేయకుండానే చాట్ చేసే అవకాశం

స్వతంత్ర వెబ్ డెస్క్: ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. సెక్యూరిటీ అప్‌డేట్ల విషయంలో ముందుంటే కంపెనీ, తాజాగా అన్-నోన్ ఫోన్ నంబర్స్‌ సేవ్ చేయకుండానే, సంబంధిత కాంటాక్ట్‌తో చాట్ చేసే కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేసింది. ఆండ్రాయిడ్, iOS స్టేబుల్ వాట్సాప్ యూజర్లందరికీ ఈ స్పెసిఫికేషన్ అందుబాటులోకి వస్తోంది. వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, ఇకనుంచి వాట్సాప్ యూజర్లందరూ తెలియని నంబర్లను అడ్రస్ బుక్‌లో సేవ్ చేసుకోకుండానే చాట్ ఇనీషియేట్ చేయవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
యూజర్లు ముందు వాట్సాప్‌లో కాంటాక్ట్స్ లిస్ట్‌ ఓపెన్ చేయాలి. సెర్చ్ బార్‌లో అన్ నోన్ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. ఆ కాంటాక్ట్‌కు వాట్సాప్‌ అకౌంట్ ఉంటే, ఓపెన్ చాట్ బటన్‌పై క్లిక్ చేయాలి. వాట్సాప్ అప్పుడు తెలియని ఫోన్ నంబర్‌తో చాట్ విండోను తెరుస్తుంది. సేవ్డ్‌ కాంటాక్ట్‌తో చాట్ చేసినట్లే ఆ తెలియని వ్యక్తితో చాట్ చేయడం ప్రారంభించవచ్చు. iOS, ఆండ్రాయిడ్ యూజర్లు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ కొత్త ఫీచర్ ఉపయోగించవచ్చు. తెలియని నంబర్లతో ఓపెన్ చాట్ చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్నదని గమనించాలి. ఎందుకంటే, వారు స్కామర్ లేదా స్పామర్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ ఫీచర్‌ ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ప్రయోజనాలు ఏంటి అంటే.. ఈ ఫీచర్‌తో యూజర్లకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయని WABetaInfo నివేదిక పేర్కొంది. సాధారణంగా తెలియని నంబర్‌ల నుంచి కాల్స్‌ వచ్చినప్పుడు యూజర్లు ఫోన్ అడ్రస్ బుక్‌లో ఆ కాంటాక్ట్స్ సేవ్ చేస్తారు. తర్వాత వాట్సాప్ ప్రొఫైల్ పిక్స్ చెక్ చేసి, వాటి ఐడెంటిటీ తెలుసుకుంటారు. అయితే తర్వాత ఆ నంబర్‌ను డిలీట్ చేయపోవచ్చు.దీంతో తెలియని వ్యక్తులు మీ ప్రొఫైల్ పిక్స్, వాట్సాప్ అప్‌డేట్స్ చూసే అవకాశం ఉంది. ఇది ప్రైవసీకి భంగం కలిగిస్తుంది. అదే కాంటాక్ట్స్‌ సేవ్ చేయకుండా ఫోన్ నంబర్ కోసం సెర్చ్ చేసి చాట్ ఓపెన్ చేస్తే ఎక్స్‌ట్రా ప్రైవసీ లభిస్తుంది. యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపడుతుంది.
వాట్సాప్ బీటా ఇన్ఫో ఈ ఫీచర్‌కు సంబంధించిన ఒక స్క్రీన్‌షాట్ కూడా పంచుకుంది. అందులో సెర్చ్ బార్‌లో తెలియని నంబర్‌తో కూడా కొత్త చాట్ ఓపెన్ చేయడం కుదిరినట్లు కనిపించింది. కాంటాక్ట్స్‌లో లేని నంబర్స్ సెర్చ్ చేసేటప్పుడు “లుకింగ్ ఔట్‌సైడ్ యువర్ కాంటాక్ట్స్” అని ఒక మెసేజ్ కనిపించింది. ఇంకా ఈ ఫీచర్ అందుబాటులోకి రాకపోతే, యాప్ అప్‌డేట్ చేసుకోవాలి.

Latest Articles

ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్…ప్రి ఎస్టిమేటెడ్ ప్లాన్ పై ఎన్నో ఆశలు, ఊహాగానాలు

ప్రీ ఎస్టిమేటెడ్ ప్లాన్, నిర్దిష్ట కాలానికి ఆదాయ వ్యయాల అంచనా, నిర్వచించిన కాలానికి జమలు,ఖర్చుల అంచనా, ఆదాయ వ్యయ ప్రణాళిక... ఇవన్నీ బడ్జెట్ నిర్వచనాలే. రాబోయే ఆర్థిక సంవత్సరానికి, గత ఏడాది...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్