24.2 C
Hyderabad
Thursday, February 5, 2026
spot_img

ఇండియా కూటమి విఫలమవ్వడానికి కారణాలు ఏమిటి ?

 బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ఇండియా కూటమిలో ఏ రోజూ ఐక్యత కనిపించలేదు. కూటమి ఏర్పాటు అయిన తొలి రోజుల నుంచే విభేదాలు పొడచూపాయి. గత ఐదేళ్ల పాలనలో బీజేపీ పాలనపై ప్రజల్లో కొంతవరకు వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఈ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మరల్చుకోవడంలో ఇండియా కూటమి నేతలు విఫలమయ్యారు.

   దేశవ్యాప్తంగా అధికార పార్టీకి ప్రజలు షాకిచ్చారు. ఈసారి ఎన్డీయే కూటమి కి 400 సీట్లు లక్ష్యంగా పెట్టు కుని బరిలోకి దిగిన బీజేపీకి ఆశాభంగమే ఎదురైంది. 400 సీట్లు సుదూర స్వప్నంగానే మిగల నుంది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బొటాబొటీ మెజారిటీతోనే బయటపడనుంది. బీజేపీకి ఇది విజయమే కానీ, ఘన విజయం కాదంటున్నాయి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు.

   ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అందరూ భావించారు. అయితే అనేక నియోజ కవర్గాల్లో బీజేపీకి ఇండియా కూటమి బ్రేకులు వేసింది. ఇండియా కూటమిలోని మిగతా భాగ స్వామ్య పక్షాలు తమ తమ రాష్ట్రాల్లో సత్తా చాటుకుంటే, కాంగ్రెస్ మాత్రం చతికిలపడింది. మొత్తంమీద ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకునే ఒక సువర్ణ అవకాశాన్ని కాంగ్రెస్ చేజేతులా జారవిడుచుకుందని చెప్పవచ్చు. ఇండియా కూటమిలో విభేదాలే కమలం పార్టీకి విజయాన్ని అందించాయి. ఇండియా కూటమిలో విభే దాలు ఉన్నా చాలా కాలంపాటు అవి బయటపడలేదు. కొన్ని నెలల కిందట అటు ఐదు రాష్ట్రాల ఎన్ని కల ఫలితాలు వెలువడ్డాయో లేదో ఇటు ఇండియా కూటమిలో అసమ్మతి స్వరాలు పైకి లేచాయి. ఇండి యా కూటమిలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈనెల కిందటేడాది డిసెంబ్ ఆరో తేదీన హస్తినలో ఇండియా కూటమి పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశం ఏర్పాటు చేశారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. అయితే కూటమిలోని కాంగ్రె సేతర నాయకుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేశారు.

  పదవుల విషయంలోనూ భాగస్వామ్య పక్షాలకు, కాంగ్రెస్ కు మధ్య దూరం పెరిగింది. ఇండియా కూటమి కన్వీనర్ పదవి ఆశించిన బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌కు ఆ పదవి దక్క లేదు. దీంతో తీవ్ర మనస్తాపంతో ఇండియా కూటమికి నితీశ్ కుమార్‌ గుడ్‌బై కొట్టారు. ఎన్డీయే కూటమిలో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య కూడా దూరం పెరిగింది. దీంతో ఒకదశలో కాంగ్రెస్‌ తో పొత్తు లేదన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. అయితే చివరకు తన రాజకీయ వైఖరి మార్చుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సై అంది. అయితే పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్‌తో పొత్తుకు ససేమిరా అంది ఆప్.

    ఎన్డీయే కూటమి గెలిస్తే నరేంద్ర మోడీ యే ప్రధాని అవుతారన్నది జగమెరిగిన సత్యం. అయితే ఇండియా కూటమి గెలిస్తే ఎవరు ప్రధాని అవుతారో కూటమి నాయకులు ఎవరూ చెప్పలేదు. దీంతో ఇండియా కూటమికి ఒక నాయకత్వం అంటూ లేదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఇండియా కూటమి గెలిచినా ప్రధాని పదవి దగ్గర కాంగ్రెస్, భాగస్వామ్య పక్షాల మధ్య తీవ్ర పోటీ ఉంటుందన్న సంకేతాలు జనంలోకి వెళ్లాయి. దీంతో ఎన్డీయే కూటమికి అనుకూలంగా ప్రజలు ఓటేశారంటారు రాజకీయ పరిశీల కులు. ఈసారి ఎన్నికల్లో బీజేపీపై చాలా చోట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఈ వ్యతిరేకతను తమకు అను కూలంగా మార్చుకోవడంలో ఇండియా కూటమి నేతలు విఫలమయ్యారు. అందివచ్చిన అవకాశా న్ని ఇండియా కూటమి చేజేతులా జారవిడుచుకుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్