24.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

కాంగ్రెస్‌కు, కరువుకు సంబంధం ఏమిటి ?

    పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవల ఓ సంచలనాత్మక ప్రకటన చేశారు. తెలంగాణ కరువు….ప్రకృతిపరంగా రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూ వస్తూ కరువును తీసుకొచ్చిందన్నారు. వంద రోజుల కాంగ్రెస్‌ పాలనలో 200 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండి పోతున్నాయన్నారు. సూర్యాపేట, జనగాం, నల్గొండ జిల్లాల్లో ఎండిన పంటల పరిశీలన సందర్భంగా తెలంగాణ కరువు గురించి కేసీఆర్ ప్రస్తావించారు. ప్రభుత్వం నీళ్లిస్తుందన్న నమ్మకంతోనే రైతులు పంటలు వేసుకున్నారన్నారు. అయితే ఇది వచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువని వ్యాఖ్యానించారు కేసీఆర్‌. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేల పరి హారం ఇవ్వాలని గులాబీ పార్టీ అధినేత డిమాండ్ చేశారు.

   గత పదేళ్లలో వ్యవసాయ స్థిరీకరణ కోసం స్పష్టమైన విధానాలతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకెళ్లింద న్నారు కేసీఆర్. సాగునీరు, ఇరవై నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా, పంట కొనుగోళ్లు, రైతు బీమా లాంటి పథకాలు అమలు చేశామని గుర్తు చేశారాయన. గులాబీ పార్టీ అధికారంలోకి రాకముందు దాదాపు 40 టన్నుల ధాన్యం పండించే స్థాయి ఉండేదన్నారు. అయితే తమ ప్రభుత్వం దీనిని మూడు కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి తీసుకెళ్లింద న్నారు. అయితే కేవలం వంద రోజుల వ్యవధిలో పంటల పరిస్థితి పూర్తిగా తారుమారైందని వ్యాఖ్యానించారు.రైతుల కష్టాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. ఢిల్లీ యాత్రలోనే కాలం వెళ్లదీస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ చేసిన ఈ కరువు కామెంట్ తెలంగాణ రాజకీయవర్గాల్లో దుమారం రేపింది. అంతేకాదు ఈ వ్యాఖ్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. కేసీఆర్‌ పై ఎదురుదాడి చేశారు.

  కాంగ్రెస్‌ పాలనలో 200 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారంటూ కేసీఆర్ చేసిన ఆరోపణను తప్పుపట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.నిజంగా 200 మంది రైతులు చనిపోతే…ఆ వివరాలు ప్రభుత్వా నికి ఇవ్వాలన్నారు రేవంత్ రెడ్డి. చనిపోయిన 200 మంది రైతులే అయితే వారి కుటుంబాలను ఆదుకునే బాధ్యత తమదేనని ముఖ్యమంత్రి రేవంత్‌ అన్నారు. అంతేకాదు..కేసీఆర్‌కు నిజంగా రైతులపై ప్రేమే ఉంటే… ఏ ఊరిలో …ఏ రైతు చనిపోయాడో…48 గంటల్లోగా ప్రభుత్వానికి వివరాలు ఇవ్వాలని కేసీఆర్‌ను కోరారు రేవంత్ రెడ్డి. ఎన్నికల తరువాత బాధిత రైతు కుటుంబ సభ్యులను సచివాలయానికి పిలిపించి వారికి న్యాయం చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. వేలాది పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు వానలు ఎప్పుడు పడతాయో తెలియదా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేశారు. కాంగ్రెస్ చలికా లంలో అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మరి అలాంటప్పుడు చలికాలంలో వానలు పడతాయా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. వర్షాకాలంలో సమృద్ధిగా వానలు పడకపో వడం వల్లనే కరువు వచ్చిందన్నారు. కేసీఆర్ పనులకు వరుణదేవుడు భయపడి పారిపోయాడన్నారు. అందుకే వానలు పడలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో కరువుకు సృష్టికర్త కేసీఆరేనన్నార. అయితే ఆ విషయం మరిచిపోయి కరువు అంశాన్ని కాంగ్రెస్ ఖాతాలో కేసీఆర్ వేస్తున్నా రని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. విద్యుత్ అంశాన్ని కూడా ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కరెంటు పోవడం అనేది ప్రస్తుతం తెలంగాణలో లేదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. కాగా కేసీఆర్ పెట్టుకున్న మైకుకు జనరేటర్ సౌకర్యం ఉందన్నారు. ఈ విషయం కేసీఆర్ మరచిపోయార న్నారు.

కరువుపై కేసీఆర్ చేసిన దుష్ప్రచారాన్ని బీసీ సంక్షేమ శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తిప్పికొట్టారు. అసలు కరువు పరిస్థితులకు,రాజకీయాలకు సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాలుగు నెలల తరువాత జనంలోకి వచ్చిన కేసీఆర్, ప్రజలను పక్కదోవ పట్టించడానికి సాగు, తాగునీటి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కిందటేడాది ఆగస్టు నెలలో తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయ న్నారు. అప్పట్లో గులాబీ పార్టీయే అధికారంలో ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ కరువుకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో ప్రస్తు తం కరువు పరిస్థితులు ఉన్నమాట వాస్తవమే. కరువు నేపథ్యంలో సాగు, తాగు నీటికి తీవ్ర ఇబ్బంది నెల కొంది. దీంతో తెలంగాణకు ప్రత్యేక నిధులు అవసరం. ఈ నేపథ్యంలో తెలంగాణ తరఫున కాంగ్రెస్ సర్కార్‌తో కలిసి కేంద్ర ప్రభుత్వంపై కొట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌పై ఉంది. అయితే ఆ బాధ్యతను విస్మరించి మూడు నెలల కిందట వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ నిరాధార ఆరోపణలు చేయడం తెలంగాణ సమాజాన్ని విస్మయ పరచింది. ఇప్పటికైనా కేసీఆర్ చిల్లర ఆరోపణలు, విమర్శలు మానేసి నిర్మాణాత్మక ప్రతిపక్షనేతగా వ్యవహరిం చాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్