Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

ఐపీఎల్ గెలుపుకి ఏపీలో డీడీపీ విజయానికి లింకేమిటి ?

    ఐపీఎల్‌ ఆటలో కోల్‌కతా కప్పు కొట్టడంతో ఏపీలో టీడీపీ విజయం పక్కా అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అదేం లెక్క అని ఆశ్చర్యపోతున్నారా.? క్రికెట్‌కి, రాజకీయానికి ఏంటి సంబంధమని ఆలోచన లో పడ్డారా..? అయితే, నెట్టింట వైరల్‌ అవుతున్న ఇండియన్ పొలిటికల్ లీగ్ గురించి తెలుసుకోవా ల్సిందే.

    ఓ వైపు దేశరాజకీయాలు, మరోవైపు ఐపీఎల్‌ పోరు సాగిన వేళ. ఫైనల్‌ పోరులో సన్‌రైజర్స్‌పై సునాయా సంగా గెలిచి కప్పు తన్నకుపోయింది కోల్‌కతా నైట్‌ రైడర్స్‌. ఐపీఎల్‌ సమరం ముగిసింది. దీంతో జనాలంతా హోరాహోరీగా సాగిన పొలిటికల్‌ గేమ్‌ విజేతలెవరన్నదానిపై అంచనాలు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో క్రికెట్‌కు, రాజకీయాలకు ముడిపెడుతూ ఆసక్తికర చర్చకు తెరలేపారు నెటిజన్లు. పదేళ్లనాటి ఐపీఎల్‌ ఫలితాలను గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో టీడీపీ సాధించిన విజయం గురించి ప్రస్తావిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్‌ పొలిటికల్‌ గేమ్‌పై ఆసక్తికర చర్చ సాగుతోంది.

      ఈ ఏడాది కప్పు కొట్టుకుపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గత పదేళ్ల క్రితం కూడా అంటే 2014లో జరిగి ఐపీఎల్‌ ఫైట్‌లో విజేతలుగా తమ సత్తా చాటి ట్రోఫీని సొంతం చేసుకున్నారు. గౌతమ్‌ గంభీర్‌ సారథ్యంలో కింగ్స్ ఎలవెన్ పంజాబ్‌పై ఘన విజయం సాధించి కప్పు కైవసం చేసుకుంది కేకేఆర్‌ టీమ్‌. అదే ఏడాది ఐపీఎల్‌ పూర్తయ్యాక ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. టీడీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అటు కోల్‌కతా గెలవడం, ఇటు టీడీపీ అధికారంలోకి రావడం జరిగింది. ఇక ఇప్పడు మళ్లీ సన్‌రైజర్స్‌పై కేకేఆర్‌ కప్పుకొట్టడంతో త్వరలో వెలువడే ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ గెలిచి అదే సీన్‌ రిపీట్‌ అవుతుందన్న అంచనాల్లో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. 2014లో కోల్‌కతా గెలిచింది, టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా అదే టీం గెలిచింది కాబట్టి టీడీపీ అధికారంలోకి వస్తుందన్న లాజిక్‌ను తెరపైకి తెస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో నెట్టింట పొలిటికల్‌ వార్‌ నడుస్తోంది. టీడీపీ అభిమానుల అంచనాలు తారుమారవుతాయంటూ అభిమానులు ఎద్దేవా చేస్తుండటంతో ఇరు పార్టీల మధ్య కామెంట్ల బుల్లెట్లు పేలుతున్నాయి.ఇక ఒక్క ఏపీ ఎన్నికలే కాదు. దేశవ్యాప్తంగా జరగుతున్న సార్వత్రిక ఎన్నికలను కూడా ఐపీఎల్‌తో లింక్‌ పెడుతున్నారు. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్‌లో గెలిచి ట్రోఫీని అందుకుందని.. 2014 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. 2024లో కూడా ఐపీఎల్‌ ఫైనల్‌లో కోల్‌కతా గెలిచి కప్ దక్కించుకుంది కాబట్టి 2024 ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇలా ఐపీఎల్‌ విక్టరీకి, పొలిటికల్‌ గేమ్‌కి లింక్‌ ఉందంటూ అంచనాలు వేస్తున్నారు.

మరోవైపు క్రికెట్‌కు, రాజకీయాలకు ఏంటి సంబంధమని నిలదీస్తున్నారు మరి కొందరు నెటిజన్లు. క్రికెట్‌ లో బాగా ఆడిన జట్టు విజయాన్ని సాధిస్తుందని, రాజకీయాల్లో ప్రజల మనసు గెలుచుకున్న వారే విజేతల వుతారని వివరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే పైన చెప్పిన లాజిక్‌లు నిజమవుతాయని, ప్రతిసారి అలా జరిగే అవకాశమే ఉండదని విమర్శిస్తున్నారు. ఇలా మొత్తానికి కేకేఆర్‌ విజయానికి, ఏపీ ఎన్నిక లకు ముడిపెడుతూ సోషల్‌ మీడియా వేదికగా ఆసక్తికర చర్చ సాగిస్తున్నారు. మరి తెలుగు తమ్ముళ్లు, చంద్రబాబు అభిమానులు ఆశిస్తున్నట్టు అదే జరుగుతుందా?లేదంటూ అందుకు భిన్నంగా ఫలితాలు వస్తాయా అన్నది తెలియాలంటే మాత్రం జూన్‌ 4న వెలువడే ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్