30.9 C
Hyderabad
Saturday, February 28, 2026
spot_img

కేసీఆర్ వల్ల రైతులు, పేదలకు ఒరిగింది ఏం లేదు- అమిత్ షా

స్వతంత్ర వెబ్ డెస్క్: కేటీఆర్ ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇవాళ ఆదిలాబాద్ జనగర్జన సభలో పలు ఆసక్తికర విషయాలను మాట్లాడారు అమిత్ షా. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలాబాద్ ఆదివాసులకు ఏం చేశారో చెప్పాలి. తెలంగాణను ఆత్మహత్యల్లో, నిరుద్యోగంలో, కుంభ కోణాల్లో నెంబర్ వన్ చేశారు. గత పదేళ్లలో కేసీఆర్ తెలంగాణలో రైతులు, పేదలకు ఒరిగింది ఏం లేదన్నారు. కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు.

సీఎం కాక ముందు దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానన్నారు. ఆ తరువాత దళితుడి ముఖ్యమంత్రి ఏమైంది అని ప్రశ్నించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఏమైంది అని ప్రశ్నించారు అమిత్ షా. దళిత బంధును కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు.   మోడీ ప్రభుత్వం తెలంగాణకు  కృష్ణా ట్రిబ్యునల్, గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. డిసెంబర్ 03న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు అమిత్ షా. మోడీ ప్రభుత్వం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిందని తెలిపారు. గిరిజన యూనివర్సిటీకీ కేసీఆర్ ప్రభుత్వం స్థలం కూడా చూపించడం లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్