Free Porn
xbporn
24.7 C
Hyderabad
Tuesday, September 17, 2024
spot_img

ప్రభాకర్‌ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం- హరీష్ రావు

స్వతంత్ర వెబ్ డెస్క్: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్(BRS) అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి(kotha Prabhakar Reddy)పై జరిగిన దాడిని మంత్రి హరీశ్ రావు(Harish Rao) తీవ్రంగా ఖండించారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి అత్యంత గర్హణీయమన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు.

సూరంపల్లి(Surampally)లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు దాడి(Attack) జరిగిందని తెలిపారు. రాజు అనే వ్యక్తి దాడి చేశాడు. ప్రభాకర్ రెడ్డికి మెరుగైన వైద్యం అందించేందుకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి(Yashoda Hospital)కి తీసుకొచ్చాం. వైద్యులు సర్జరీ చేస్తున్నారు. అనంతరం వైద్యులు ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యంపై వెల్లడిస్తారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చాలా సౌమ్యుడు.. చీమకి కూడా హాని తలపెట్టని వ్యక్తి అని.. అలాంటి నాయకుడిపై దాడి జరగడం విచారకరమని హరీష్ రావు(Harish Rao) అన్నారు.  కత్తి లోపలికి ఎక్కువగా దిగకపోవడం అదృష్టంగా భావించాలన్నారు. ప్రత్యర్థులు రాజకీయంగా ఎదుర్కోవాలని.. ఇలా దాడులు చేయడం సరికాదన్నారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దన్నారు. ప్రభాకర్ రెడ్డి(Prabhakar Reddy)ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని మంత్రి హరీశ్ చెప్పారు. ఈ హత్యాయత్నంలో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా? అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని హరీశ్ రావు తెలిపారు.

బీఆర్ఎస్(BRS) కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని.. తమకు తిక్కరేగితే దుమ్మురేగుతుందని కేసీఆర్(KCR) హెచ్చరించారు. దాడులకు దిగేవారు జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షాలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ప్రజల కోసం పనిచేసే నాయకులపై ఇలాంటి దాడులు జరగడం విచారకరమన్నారు.

ఆస్పత్రిలోకి పరుగుతీసిన మంత్రి 

అంబులెన్స్‌లో ప్రభాకర్ రెడ్డిని ఆస్పత్రికి తీసుకురాగా.. మంత్రి హరీశ్ రావు(Harish Rao) తన కారులోంచి దిగి ఆస్పత్రిలోకి పరుగెత్తుకుంటూ వెళ్లారు. ప్రభాకర్ రెడ్డికి వైద్యులు సిటీ స్కాన్ చేశారని చెప్పారు. కడుపులో రక్తస్రావం అయ్యిందని తెలిపారని చెప్పారు. సర్జరీ చేయాల్సి ఉండటంతో ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులతో మాట్లాడి ఏర్పాట్లు చేశారని తెలిపారు. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.

సర్జరీ అనంతరం వివరాలు మీడియాకు చెబుతామని హరీశ్ రావు తెలిపారు. ఆయన కోలుకుంటారని, కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన రాజు అనే వ్యక్తిని అరెస్టు చేసి, పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు. నిందితుడు రాజు(Raju) ఏ పార్టీకి చెందినవారనేది తెలియదన్నారు. ప్రభాకర్ రెడ్డి బాడీగార్డ్ అప్రమత్తమై దాడి సమయంలో రాజును నిలువరించడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పిందన్నారు. సీఎం కేసీఆర్ సాయంత్రం ఆస్పత్రికి వచ్చి ప్రభాకర్ రెడ్డిని పరామర్శిస్తారని చెప్పారు.

నిందితుడు రాజుపై కేసు నమోదు

కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన నిందితుడు రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్(Daulatabad) మండలం సూరంపల్లి(Surampally)లో ప్రచారం చేస్తుండగా.. గడ్డం రాజు అనే వ్యక్తి కలవడానికి వచ్చి కత్తితో పొడిచిట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు రాజు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు సీపీ ఎన్ శ్వేత తెలిపారు.

అయితే, నిందితుడు రాజు 10 రోజుల కిందటే బీజేపీ(Bjp) పార్టీలో చేరాడని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(MLA Raghunandan Rao) సమక్షంలో అతడు కాషాయ కండువా కప్పుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు కాంగ్రెస్(Congress) పార్టీ కార్యకర్త అని మరికొంత మంది పోస్టులు పెడుతున్నారు.

Latest Articles

చట్టం ప్రకారం వారిని సస్పెండ్ చేయడమే కాదు, అరెస్ట్‌ చేయాలి – డొక్కా

సినీనటి కాదంబరి జత్వాని పట్ల నీచంగా వ్యవహరించిన పోలీసు అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయటాన్ని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్‌ స్వాగతించారు. చట్టం ప్రకారం వారిని సస్పెండ్ చేయడమే కాదు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్