స్వతంత్ర వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లా జవహార్‌నగర్‌లో (Jawahar nagar) ఓ యువతిని వివస్త్రను చేసిన ఘటన సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే స్థాయిలో స్పందించింది. నిందితున్ని వెంటనే అరెస్ట్ చేసి.. చర్యలకు ఉపక్రమించింది.
కాగా..ఈ విషయంపై అదే నియోజకవర్గానికి చెందిన మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) స్పందించారు. బాధిత యువతిని పరామర్శించిన మంత్రి మల్లారెడ్డి.. అండగా నిలుస్తానంటూ మాట ఇచ్చారు. బాధిత యువతికి మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు మల్లారెడ్డి. అంతేకాదు.. యువతికి పెళ్లి కూడా చేపిస్తానని, డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వాలని అధికారులను మంత్రి మల్లారెడ్డి ఆదేశించారు. భవిష్యత్‌లో సదరు యువతి యోగక్షేమాలు కూడా తానే చూసుకుంటామని కుటుంబ సభ్యులకు మంత్రి మల్లారెడ్డి అభయం ఇచ్చారు.