మహాశివరాత్రి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో శ్రీస్వయంభూ రాజేశ్వర స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వర త్వరగా క్యూ లైన్ లలో భక్తులను దర్శనానికి పంపించాలని అధికారులకు సూచించారు. భక్తులతో ముచ్చటించి, అక్కడే ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్‌లో హెల్త్ చెకప్ చేయించుకున్నారు.
పొట్లపల్లి స్వయం భూ రాజరాజేశ్వర స్వామి వారిని హుస్నాబాద్ ప్రాంతం వాళ్ళకే కాక, ఇతర జిల్లాల వాళ్ళు కూడా కొంగు బంగారంగా పెద్ద ఎత్తున దర్శించుకుంటారని మంత్రి తెలిపారు. భవిష్యత్‌లో దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. 20 సంవత్సరాలుగా పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ప్రతి శివరాత్రికి దర్శించుకుంటున్నన్నారు. ఈసారి ఆరెపల్లి నుండి పందిల్ల వరకు వయా పొట్లపల్లి మీదుగా డబుల్ రోడ్డు వేయించామన్నారు.