నిరుద్యోగులను ఎన్నికల కోసం కాంగ్రెస్ వాడుకుందని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ఏడు రోజులుగా నిరుద్యోగుల సమస్యలపై దీక్ష చేస్తున్న మోతీలాల్ అస్వస్థతకు గురయ్యారు. సికింద్రా బాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోతీలాల్‌ను ఆయన పరామర్శించారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ హామీ ఎమైందని ప్రశ్నించారు. రేవంత్ కోదండరాం సమాధానం చెప్పాల న్నారు. దీక్ష చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదని మండిపడ్డారు. మోతీలాల్ ఆరోగ్యం క్షీణిస్తోందని చెప్పారు. రేవంత్ స్వయంగా బాధితుడితో మాట్లాడాలని, లేకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తామని హరీష్ రావు హెచ్చరించారు.


