మార్పు కావాలని.. ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యం అని కాంగ్రెస్ నీ దివించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అభివృద్ధి..సంక్షేమం రెండు కళ్లుగా పనిచేస్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఖజానా చూస్తే 7 లక్షల కోట్ల అప్పు ఉన్నా.. ఇచ్చిన మాట ప్రకారం సర్కార్ వచ్చిన వెంటనే ఐదు పథకాలు అమలు చేశామన్నారు. కేసీఆర్ ధనిక రాష్ట్రం అన్నారు కానీ… ఖజానా మాత్రం ఖాళీ అని, తాము అధికారంలోకి వచ్చిన కొత్తలో అప్పు చూసి షాక్ అయ్యామన్నారు.