25.7 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

అంచనాలు తారుమారు చేశాం.. మమ్మల్ని ఓడించడం బీజేపీ వల్ల కాదు- రాహుల్

స్వతంత్ర వెబ్ డెస్క్: ఇండియా కూటమి ఐక్యత అసాధ్యమని బీజేపీ విమర్శలు చేస్తోందని, కానీ వారి అంచనాలు తారుమారు చేస్తూ తమలో ఏకాభిప్రాయం కుదరిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ముంబైలో జరిగిన రెండు రోజుల సమావేశం అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ… బీజేపీ ఓటమికి తాము బలమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు.

దేశంలోని అందరి నుండి దోచుకొని, కొంతమందికి మేలు చేసేందుకే మోదీ సర్కార్ కృషి చేస్తోందని దుయ్యబట్టారు. తమ కూటమిని ఓడించడం బీజేపీ వల్ల కాదన్నారు. తమ కూటమి 60 శాతం భారతీయులకు ప్రతీక అన్నారు. సీట్ షేరింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. తామంతా ఒక్కటైతే కనుక బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోను గెలవలేదన్నారు. తాము అభివృద్ధి ప్రాతిపదికన ముందుకు సాగుతామన్నారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, ఇది లడఖ్‌లో ప్రతి వ్యక్తికి తెలుసునని చెప్పారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్