ప్రధాని మోదీ నాయకత్వంలో గనుల శాఖలో చాలా మార్పులు వచ్చాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గనుల శాఖలో నూతన పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. 12 ఖనిజాల రాయల్టీని పెంచామన్న కిషన్ రెడ్డి….ఈ ఏడాది 448 ప్రాజెక్టుల్లో గనుల అన్వేషణను జీఎస్‌ఐ చేపట్టిందని తెలిపారు. గనుల అన్వేషణలో ప్రైవేటు రంగాన్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. మైనింగ్‌లో ప్రైవేటు సంస్థలను కూడా భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. ఆఫ్ షోర్ ఏరియాలో మైనింగ్ ఉత్పత్తిని పెంచుతున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 103 బ్లాకుల గనులను వేలం వేశాయని కిషన్ రెడ్డి చెప్పారు.