24.2 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

హీరోయిజం గురించి ఎన్టీయార్ బామ్మర్ది భలే చెప్పాడు: అల్లు అరవింద్

ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహించారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ ‘ఆయ్’ అని టైటిల్ పెడితే.. ఒక ప్రాంతానికే పరిమితం అవుతుందా? అని అనుకున్నాం. దాని కోసం ఇరవై రకాల వేరియేషన్స్‌లో అనుకున్నాం. కానీ ఫిదా టైటిల్ అన్ని చోట్ల వర్కౌట్ అయింది. కథ బాగుంటే అందరూ ఆదరిస్తారు. ఈ కథను ఒప్పుకున్న నితిన్ గారికి థాంక్స్. ‘కథ చాలా సరదాగా ఉంది. కథ హిట్ అయితే అదే హీరోయిజం’ అని నితిన్ అన్నారు. ఈస్ట్ గోదావరిలో వర్షంలో తీస్తానని అన్నారు. వర్షం కోసమే కోటిపైగా ఖర్చు పెట్టారు. రషెస్ చూశాను. సినిమా చూస్తే మనం నిజంగానే ఆ ఊర్లోకి వెళ్లి వర్షంలో తడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ కథ ఓకే అయిన తరువాత ఎన్టీఆర్ గారికి ఫోన్ చేశాం. ‘ఫస్ట్ డే వరకు మనం పుష్ చేస్తాం.. ఆ తరువాత సినిమా బాగుంటేనే ఆడుతుంది.. ఎవరి కష్టం వారిదే.. సినిమా కథ బాగుందని అంటున్నారు.. చేసేయండి’ అని ఎన్టీఆర్ అన్నారు. నితిన్ ఈ చిత్రంలో ఎంతో ఈజ్‌తో నటించాడు. కొత్త వాళ్లని ఎంకరేజ్ చేద్దామని అజయ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి బన్నీ వాస్ చెప్పాడు. లిరిసిస్ట్ సురేష్ గారు మంచి పాటలు ఇచ్చారు. మా బ్యానర్లో కష్టం వస్తే.. చైతన్య గారు ముందుకు వస్తారు. మా సినిమాను ఆడియెన్స్ వరకు మీడియా తీసుకెళ్లాలని కోరుతున్నాను’ అని అన్నారు.

నార్నే నితిన్ మాట్లాడుతూ.. ‘మేం మంచి గోదావరి సినిమాను తీశాం. మంచి ఫ్రెండ్ షిప్ గురించి చెప్పాం. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఇంత మంచి చిత్రంలోకి నన్ను తీసుకున్న అంజి గారికి, బన్నీ వాస్ గారికి, అల్లు అరవింద్ గారికి థాంక్స్. రామ్ మిర్యాల, అజయ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అంకిత్, చౌదరి గార్లు మంచి సపోర్ట్ ఇచ్చారు. అంజి గారు కథ చెబుతుంటేనే నాకు సినిమా కనిపించింది. మూడు గంటలు నెరేషన్ వింటే.. నవ్వుతూనే ఉన్నాను. ఆడియెన్స్ కూడా అలానే నవ్వుతూనే ఉంటారని ఆశిస్తున్నా’ అని అన్నారు.

బన్నీ వాస్ మాట్లాడుతూ.. ‘నాకు ఎంటర్టైన్, ఫన్ అంటే చాలా ఇష్టం. ఎంత కష్టంలో, ఒత్తిడిలో ఉన్నా కూడా ఒక జోక్ మనకు రిలీఫ్ ఇస్తుంది. ఈ సినిమా చూస్తే కచ్చితంగా నవ్వి నవ్వి బుగ్గలు నొప్పి పెడతాయి. ఆ గ్యారెంటీ మేం ఇస్తున్నాం. ఇంకా గట్టిగా నవ్వే వాళ్లుంటే.. పొట్ట కూడా నొప్పి పుడుతుంది. అంజి నాకు రెండు గంటలు కథను చెబుతూనే సినిమాను చూపించాడు. ఆ కథ విని రెండు రోజులు నవ్వుతూనే ఉన్నాను. నేను ఎన్నికల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా చైతన్య గారు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. నేను లేకపోయినా అన్నీ ఆయనే దగ్గరుండి పని చేశారు. ఈ చిత్రం అందరినీ నవ్విస్తుంది. మీమర్స్‌కు మంచి కంటెంట్ దొరుకుతుంది. నితిన్, అంకిత్, కసిరాజు అద్భుతంగా నటించారు. మూడు పాత్రలకు మంచి స్కోప్ ఉంటుంది. మ్యాడ్ బాగా ఆడుతోంది.. ఈ సినిమా ఒప్పుకుంటాడా? లేదా? అని అనుకున్నాను. సినిమా కథ బాగుంది.. నేను ఒక అప్ కమింగ్ హీరోని.. అలాంటి వాడికి మంచి సినిమా దొరికితే అంతే చాలు కదా అని అన్నారు. అలా నితిన్ అన్నప్పుడు నాకు రేసుగుర్రంలో బన్నీ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. సినిమా బాగుంటే చాలు పాత్రల గురించి పట్టించుకోవద్దు అని బన్నీ అంటారు. అజయ్ అరసాడ మంచి పాటలు, అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు. రామ్ మిర్యాల గారు మంచి సాంగ్ ఇచ్చారు. హైద్రాబాద్‌లోనే మంచి మ్యూజిక్ డైరెక్టర్లు పుట్టుకొస్తుండటం ఆనందంగా ఉంది. సురేష్ గారు బేబీకి పాటలు రాశారు. ఇప్పుడు మా సినిమాకి రాశారు. కసిరాజు, అంకిత్ గురించి టీజర్ రిలీజ్ అయ్యాక మాట్లాడతాను’ అని అన్నారు.

దర్శకుడు అంజి కె.మ‌ణిపుత్ర‌ మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు గోదావరి ప్రాంతాన్ని బేస్ చేసుకుని వచ్చిన చిత్రాలన్నింటిల్లోకెల్లా ది బెస్ట్ చిత్రం అవుతుంది. నితిన్ నార్నే ఎంతో సహజంగా నటించారు. అచ్చం అక్కడి యాసలానే మాట్లాడాడు. అంకిత్, కసిరాజు అద్భుతంగా నటించారు. అజయ్ గారు మంచి పాటలు ఇచ్చారు. బన్నీ వాస్ ఆల్ రౌండర్.ఆయన లేకపోతే ఈ చిత్రం లేదు. అమ్మాయిలను నేచర్‌తో పోల్చుతాం. అమ్మాయి తడిసినా, ఊరు తడిసినా అందంగా ఉంటుంది. మా ఆయ్ చిత్రం కూడా అంత అందంగా ఉంటుంది’ అని అన్నారు.

అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరీ వంటి చిత్రాల్లోని కామెడీని యూట్యూబ్‌లో చూస్తుంటాం. అలాంటి కోవలోకే ఈ ఆయ్ కూడా వస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఎంతో వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది. ఆగస్ట్ 15న మా చిత్రం రాబోతోంది’ అని అన్నారు.

అజయ్ అరసాడ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రానికి మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన బన్నీ వాస్ గారికి, అల్లు అరవింద్ గారికి థాంక్స్. మిస్సింగ్ సినిమా ఈవెంట్‌కు వచ్చిన బన్నీ వాస్ గారు నాడు ఇచ్చిన మాట ప్రకారం నాకు ఈ చిత్రాన్ని ఇచ్చారు. స్కోరింగ్ పరంగా డిఫరెంట్ టోన్స్ ట్రై చేస్తున్నాను. చైతన్య, అంజి, సురేష్ గారు ఇచ్చిన సపోర్ట్‌కు థాంక్స్’ అని అన్నారు

చైతన్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను కొంత చూశాను. చాలా ఏళ్ల తరువాత సినిమాను చూసి బాగా నవ్వాను. ఈ చిత్రాన్ని అంజి బాగా తీశారు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

లిరిసిస్ట్ సురేష్ బనిశెట్టి మాట్లాడుతూ.. ‘రామ్ మిర్యాల గారికి రంగనాయకి పాట నేనే రాశాను. అజయ్ అరసాడ గారికి ఈ థీమ్ పాటని కూడా నేనే రాశాను. పాటలు ఎంత పెద్ద హిట్ అవుతున్నాయో సినిమాను కూడా అంత పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంత పెద్ద బ్యానర్లో పాటలు రాసే అవకాశం రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

GA2 పిక్చర్స్:

ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో రూపొందాయి.

నటీనటులు: నార్నే నితిన్, నయన్ సారిక తదితరులు

సాంకేతిక వర్గం:

బ్యానర్ – GA2 పిక్చర్స్, సమర్పణ – అల్లు అరవింద్, నిర్మాతలు – బన్నీ వాస్, విద్యా కొప్పినీడి, డైరెక్టర్ – అంజి కె.మ‌ణిపుత్ర‌, సహ నిర్మాతలు – భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, సినిమాటోగ్రఫీ – సమీర్ కళ్యాణి, సంగీతం – రామ్ మిర్యాల, ఎడిటర్ – కోదాటి పవన్ కళ్యాణ్, ఆర్ట్ డైరెక్టర్ – కిరణ్ కుమార్ మన్నె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అజయ్ గద్దె, కాస్ట్యూమ్స్ – సుష్మిత, శిల్ప, కో డైరెక్టర్ – రామ నరేష్ నున్న, పి.ఆర్.ఒ – వంశీ కాకా, మార్కెటింగ్ – విష్ణు తేజ్ పుట్ట, పోస్టర్స్ – అనిల్, భాను.

Latest Articles

లిక్కర్‌ కేసులో మళ్లీ కదలికలు.. కేజ్రీవాల్‌, సిసోడియాకు కొత్త చిక్కులు

ఢిల్లీ ఎన్నికలకు ముందు లిక్కర్ పాలసీ కేసు మళ్లీ ముందుకు కదిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ మళ్లీ ఇబ్బందుల్లో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లిక్కర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్