27.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
spot_img

వైసీపీ పాలనలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం- రజని

ఏపీ రాజకీయాలు ఆరోగ్యశ్రీ చుట్టూ తిరుగుతున్నాయి. కేంద్ర సహాయ మంత్రి, టీడీపీ ఎంపీ పెమ్మసాని వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. తాజాగా ఆరోగ్యశ్రీ బకాయిలపై మాజీ మంత్రి విడుదల రజని మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ పాలనలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని.. అయితే 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తుందని రజని తెలిపారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు.. టీడీపీ సర్కార్ ఉంచిన ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించామని గుర్తుచేశారు. ప్రస్తుతం వైసీపీపై కూటమి సర్కార్ పై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విడుదల రజని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న చంద్రబాబు సర్కార్ .. సాకులు వెతుకుతూ.. పేదలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. జనవరి లోగా ఆస్పత్రులకు ఉన్న బకాయిలు చెల్లించాలని విడుదల రజని డిమాండ్ చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్