ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ని బలపరుస్తూ..ఏపీ ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ నిజాయితీ, నరేంద్ర మోడీ సహకారం జోడించి రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్నామన్నారు. చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న ఆంధ్రప్రదేశ్‌ను అందరం చూశామని చెప్పారు. పట్టభద్రులు ఎక్కువ శాతం జనసేన వైపు చూస్తున్నారని..గత ఎన్నికల్లో హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి వచ్చి పట్టభద్రులు పార్టీని గెలిపించారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ను మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.