తామంతా మోదీ వెంటే ఉన్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. మోదీ ప్రధానిగా ఉన్నంతవరకు ఏ దేశానికి భారత్ తలొగ్గదన్న పవన్ కళ్యాణ్.. మోదీ నేతృత్వంలో పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నామని చెప్పారు.