గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజక వర్గంలో తాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని పత్తిపాడు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి భుర్ల రామాంజనేయులు అన్నారు. రైతుల సంక్షేమం విస్మరించారని రోడ్లు అధ్వానంగా తయారు అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తిపాడు నియోజక వర్గ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మాజీ హోం మంత్రి సుచరిత ను నిలదీస్తున్నారనిటీడీ ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికలలో టిడిపి కి ప్రజలు పట్టం గడతారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని తెలిపారు.


