కర్నూలు జిల్లా మంత్రాలయ టిక్కెట్ రాఘవేంద్రరెడ్డికి కేటాయించడంతో టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తిక్కారెడ్డి అనుచరులు కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. తిక్కారెడ్డికి టిక్కెట్ ఇస్తేనే సహకరిస్తామని లేదంటే..పార్టీకి దూరం గా ఉంటామని హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలోనే పార్టీ పెద్దలు తిక్కారెడ్డితో సమావేశం అయ్యారు. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని పునరాలోచన చేస్తామని టీడీపీ శ్రేణులకు టీడీపీ పెద్దలు హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు.