24.2 C
Hyderabad
Thursday, December 26, 2024
spot_img

‘గం..గం..గణేశా’తో ఆనంద్ ముఖంలో నవ్వు చూడాలి: రష్మిక

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా”. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. “గం..గం..గణేశా” ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. నేషనల్ క్రష్ రశ్మిక మందన్న అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నటుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ – ఒక కొత్త టీమ్ తమని తాము ప్రూవ్ చేసుకునేందుకు చేసిన సినిమాలా “గం..గం..గణేశా” ఉంటుంది. కేవలం హీరోయిక్ గా ఉండే కథ కాదిది. అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సినిమాలో దాదాపు 35 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆనంద్ దేవరకొండకు ఒక డిఫరెంట్ మూవీ అవుతుంది. అన్నారు.

లిరిసిస్ట్ సురేష్ బనిశెట్టి మాట్లాడుతూ – “గం..గం..గణేశా” సినిమాలో నేను పిచ్చిగా నచ్చాశావే అనే పాట రాశాను. ఈ పాటకు చేతన్ భరద్వాజ్ మంచి ట్యూన్ చేశారు. అనురాగ్ కులకర్ణి పాడారు. ఈ పాటకు లిరిక్స్ ఇవ్వడాన్ని ఎంజాయ్ చేశా. రశ్మిక మందన్న ఈ కార్యక్రమానికి గెస్ట్ గా రావడం హ్యాపీగా ఉంది. అన్నారు.

డ్యాన్స్ మాస్టర్ విజయ్ పొలాకీ మాట్లాడుతూ – ఆనంద్ అన్నతో వర్క్ చేయడం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. ఆయనతో ఇలాగే కలిసి వర్క్ చేయాలని కోరుకుంటున్నా. డైరెక్టర్ ఉదయ్ ఈ సినిమాతో హిట్ మూవీ అందుకోబోతున్నావు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా.

నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ – వినాయకుడి శిల్పాన్ని ఎంత అందంగా తయారు చేస్తారో ఈ సినిమాను కూడా మా డైరెక్టర్ ఉదయ్ అంతే అందంగా రూపొందించారు. ప్రతి సీన్ చెక్ చేసుకుంటూ రీ షూట్ చేస్తూ పర్పెక్ట్ గా తను అనుకున్నట్లు తెరకెక్కించాడు. ఉదయ్ ఖచ్చితంగా మంచి డైరెక్టర్ అవుతాడు. హీరో ఆనంద్, ఇద్దరు హీరోయిన్స్, ఇతర కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్. “గం..గం..గణేశా” పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు యావర్ మాట్లాడుతూ – సినిమాల్లో నటించాలనే నా కలను నిజం చేసింది “గం..గం..గణేశా” మూవీ. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన ఆనంద్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ నెల 31న మూవీ రిలీజ్ అవుతుంది. మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ – “గం..గం..గణేశా” సినిమా స్క్రిప్ట్ నుంచి మేకింగ్ వరకు మా డైరెక్టర్ ఉదయ్ చాలా కష్టపడ్డాడు. ఆనంద్ తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాలో ఆనంద్ ను ఇప్పటిదాకా చూడని కొత్త తరహా క్యారెక్టర్ లో మీరంతా చూస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ బీజీఎంతో మూవీకి లైఫ్ ఇచ్చారు. పిచ్చిగా నచ్చాశావే నా ఫేవరేట్ సాంగ్. హీరోయిన్ ప్రగతి బ్యూటిఫుల్ అమ్మాయి. తనతో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. తన పర్ ఫార్మెన్స్ చూశాను చాలా బాగుంది. ఈ సినిమాకు మా టీమ్ పడిన కష్టానికి ఫలితం ఉంటుందని ఆశిస్తున్నాను. అన్నారు.

హీరోయిన్ ప్రగతి శ్రీవాస్తవ మాట్లాడుతూ – “గం..గం..గణేశా” నా కెరీర్ లో ఒక స్పెషల్ మూవీ. ఆనంద్ తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. అతను సపోర్టివ్ కోస్టార్. ఇలాంటి మంచి ప్రాజెక్ట్ లో అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ ఉదయ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. “గం..గం..గణేశా” హోల్ సమ్ ఎంటర్ టైనర్. సిధ్ శ్రీరామ్ నా ఫేవరేట్ సింగర్. మా మూవీలో బృందావనివే సాంగ్ ఆయన పాడినప్పుడు హ్యాపీగా ఫీలయ్యా. చేతన్ భరద్వాజ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా మూవీని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ – “గం..గం..గణేశా” సినిమాను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమాలో ఆనంద్ అన్న ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా కీలకమైంది. ఇలాంటి కీ రోల్ నేను చేయగలను అని నమ్మిన మా డైరెక్టర్ ఉదయ్ కు థ్యాంక్స్. ఈ సినిమాకు ఆయన చాలా మంచి స్క్రిప్ట్ చేశాడు. సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియెన్స్ కు మూవీలోని చాలా క్యారెక్టర్స్ పేర్లు గుర్తుంటాయి. ఆనంద్ అన్న నన్ను నమ్మి వీడు ఈ క్యారెక్టర్ చేయగలడు అని సపోర్ట్ చేశారు. పరిచయం ఉన్న అందరికీ ఆనంద్ అన్న ఎంత మంచి పర్సన్ అనేది తెలుసు. “గం..గం..గణేశా” మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – రెండు రోజుల క్రితం “గం..గం..గణేశా” చూశాను. ఆద్యంతం ఎంటర్ టైన్ చేసింది. ఎక్కడా చూపు తిప్పుకోకుండా చూసే సినిమా ఇది. ఈ హాట్ సమ్మర్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది. ఆనంద్ పర్ ఫార్మెన్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. దొరసారి, మిడిల్ క్లాస్ మెలొడీస్, బేబి ఇప్పుడు “గం..గం..గణేశా”..ఆనంద్ లైనప్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. ప్రతి సినిమా కొత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. సినిమా చూశా కాబట్టి రిలీజ్ ముందే ఈ టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.

ఆస్ట్రలాజర్ ఆర్ఎంపీ శెట్టి మాట్లాడుతూ – “గం..గం..గణేశా” పేరులోనే సక్సెస్ ఉంది. గణేశుడి పేరు పెట్టుకున్న వారికి ఏ విఘ్నాలూ ఉండవు. ఈ సినిమా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేరు, డబ్బు తీసుకొస్తుంది. బేబిలో ఆనంద్ నటన నాకు బాగా నచ్చింది. ఈ సినిమాను మూవీ టీమ్ అంతా కష్టపడి కాకుండా ఇష్టపడి చేసినట్లు తెలుస్తోంది. అన్నారు.

డైరెక్టర్ అనుదీప్ కె.వి. మాట్లాడుతూ – డైరెక్టర్ ఉదయ్ నా స్నేహితుడు. అతనికి “గం..గం..గణేశా” మంచి సక్సెస్ ఇవ్వాలి. ఆనంద్ కు గుర్తుండిపోయే సినిమాలో “గం..గం..గణేశా” ఉండాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ – “బేబి” ఎమోషనల్ మూవీ, “గం..గం..గణేశా” ఎంటర్ టైనింగ్ సినిమా. మా “బేబి” సినిమా చేసి “గం..గం..గణేశా”కు ఆనంద్ వెళ్లినప్పుడు నేను అడిగాను రెండు సినిమాల ఎక్సీపిరియన్స్ ఎలా ఉందని. ఆనంద్ చెప్పాడు బేబిలో ఎమోషనల్ గా స్ట్రెస్ అయి “గం..గం..గణేశా” సెట్ కు వెళ్లినప్పుడు చాలా ఫన్, రిలాక్స్ గా ఫీలయ్యానని. ఆనంద్ పుష్పక విమానం సినిమా ఎక్కువమంది చూడలేదు గానీ ఆయన కామెడీ టైమింగ్ పర్పెక్ట్ గా ఉంటుంది. “గం..గం..గణేశా” సినిమా మంచి ఎంటర్ టైన్ మెంట్ తో మిమ్మల్ని నవ్విస్తుందని గట్టిగా చెప్పగలను. అని అన్నారు.

నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ – “గం..గం..గణేశా” కు నాకు, కేదార్ కు సపోర్ట్ గా నిలిచిన వ్యక్తి విజయ్ మద్దూరి గారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. ఆనంద్ స్మైల్ తో ఉంటాడు. మూవీకి 10, 12 గంటలు కష్టపడినా ఎప్పుడూ చిరాకు అనేది కనిపించదు. ఆనంద్ ను ఇప్పటిదాకా మిడిల్ క్లాస్ అబ్బాయిగా, మిడిల్ క్లాస్ హజ్బెండ్ గా చూశారు. కానీ ఈ సినిమాతో ఒక ఫంకీ క్యారెక్టర్ లో చూస్తారు. ఆనంద్ ఎమోషన్ బాగా చేయగలడు అంటారు కానీ ఈ మూవీతో కామెడీతో కూడా మెప్పించగలడు అనే పేరొస్తుంది. “గం..గం..గణేశా” ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అన్నారు.

నిర్మాత కేదార్ సెలగంశెట్టి మాట్లాడుతూ – మా ఈవెంట్ కు వచ్చిన రశ్మిక గారికి, ఇతర గెస్ట్ లు అందరికీ థ్యాంక్స్. ఆనంద్, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఆనంద్ ఇవ్వడం హ్యాపీగా అనిపించింది. ఆనంద్ ను కొత్తగా తెరపై చూపించే మూవీ ఇది. మా ఫస్ట్ మూవీ అందరికీ నచ్చేలా రూపుదిద్దుకోవడం సంతృప్తినిచ్చింది. అన్నారు.

కో-ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ – రశ్మిక గారిది లక్కీ హ్యాండ్. మా ఈవెంట్ కు వచ్చినందుకు ఆ లక్ మాకు కూడా వస్తుందని అనుకుంటున్నాం. రెగ్యులర్ మూవీ లవర్స్ తో పాటు ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ అందరికీ నచ్చేలా “గం..గం..గణేశా” ఉంటుంది. అన్నారు.

డైరెక్టర్ ఉదయ్ శెట్టి మాట్లాడుతూ – “గం..గం..గణేశా” కథ చెప్పినప్పటి నుంచి మా ప్రొడ్యూసర్స్ ఎంతో సపోర్ట్ ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్ ఆదిత్య నాకు స్ట్రెంత్ అని చెప్పాలి. కొరియోగ్రఫీ, మ్యూజిక్, ఆర్ట్ వర్క్..ఇలా ప్రతి క్రాఫ్ట్ మూవీలో మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాయి. ఆనంద్ లాంటి హీరో నా ఫస్ట్ సినిమాకు దొరకడం అదృష్టం. ఆయన షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్లాక కూడా కాల్ చేసేవారు. నీకు నచ్చినట్లు సీన్ వచ్చిందా లేదా లేకుంటే మళ్లీ చేద్దాం టెన్షన్ పడకు అనేవారు. అలాంటి సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. “గం..గం..గణేశా” కామెడీ మూవీ అనుకుంటే థ్రిల్ చేస్తుంది, థ్రిల్లర్ అనుకుంటే నవ్విస్తుంది, రెగ్యులర్ యాక్షన్ కామెడీ అనుకుంటే సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ ఉంది. ఆ రోల్ థియేటర్ లో చూసి షాక్ అయ్యేందుకు రెడీగా ఉండండి. “గం..గం..గణేశా” ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ అందరూ ఇష్టపడే సినిమా అవుతుంది. అన్నారు.

నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ – ఆనంద్, విజయ్ ఫ్యామిలీ సర్కిల్ నుంచి కేదార్, వంశీ, అనురాగ్ ముగ్గురు ప్రొడ్యూసర్స్ గా రావడం సంతోషంగా ఉంది. నయన్ సారిక మా ఆయ్ సినిమాలోనూ నటిస్తోంది. ఆనంద్ కు బేబి తర్వాత వస్తున్న “గం..గం..గణేశా” మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. మా శ్రీవల్లి రశ్మిక ఈ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. డైరెక్టర్ ఉదయ్ అండ్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.

నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ – “గం..గం..గణేశా” ప్రొడ్యూసర్స్ వంశీ, కేదార్ వారికి సపోర్ట్ చేసిన విజయ్ నాకు మంచి ఫ్రెండ్స్. కో ప్రొడ్యూసర్ అనురాగ్ కూడా మంచి మిత్రుడు. ఆనంద్ గురించి చెప్పాలంటే నేను పనిచేసివారిలో మోస్ట్ ప్యాషనేట్ హీరో. సినిమా పట్ల డెడికేషన్ ఉన్న హీరో. ఆయనకు బేబిని మించిన సక్సెస్ “గం..గం..గణేశా” ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – “గం..గం..గణేశా” ఎందుకు చేశారని ఇంటర్వ్యూస్ లో కొందరు అడిగారు. నాకు వై అనే బదులు వై నాట్ అనే ప్రశ్న మొదలవుతుంటుంది. క్రైమ్ కామెడీలో ఫ్యామిలీ ఎమోషన్స్ కలిపి ఫంకీ క్యారెక్టర్ తో ఒక కథ దొరికితే వదుకోవాలని అనిపించదు. నేను ఇప్పటిదాకా ఈ సినిమాలో కనిపించనంత ఎనర్జిటిక్ గా మరే మూవీలో కనిపించలేదు. నాలో ఆ ఎనర్జీని డైరెక్టర్ ఉదయ్ చూపించాడు. ఇలాంటి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన ఉదయ్ కు థ్యాంక్స్. బేబి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు రెగ్యులర్ గా ఎస్ కేఎన్, సాయి రాజేశ్, ధీరజ్, మారుతి గారికి కాల్ చేసేవాడిని. సినిమా బాగా వస్తుందా అని. నాకు కాన్ఫిడెన్స్ తక్కువ. నా చుట్టూ ఉన్న వాళ్ల దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ తీసుకుంటా. మారుతి చెప్పారు మీరు చేసిన సినిమా ఎంటో తెలుసా. బేబి రిలీజ్ అయ్యాక మీ కెరీర్ మారిపోతుందని. ఆయన చెప్పినట్లే జరిగింది. తన మాటలతో నాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారు మారుతి. “గం..గం..గణేశా” టైమ్ లో కూడా ఉదయ్ కు ఫోన్ చేసి ఎలా వస్తుంది మూవీ బాగుందా అని విసిగించేవాడిని. నిన్న మా మూవీకి సంబంధం లేని యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ వందమందికి సినిమా చూపించాం. వాళ్లంతా మూవీలో వచ్చే ట్విస్ట్స్, టర్న్స్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమ్మర్ కు పర్పెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “గం..గం..గణేశా”. ఈ 31కి మాతో పాటు మరో రెండు సినిమాలు వస్తున్నాయి. హెల్దీ కాంపిటేషన్ ఉండాలి. అన్ని సినిమాలు ప్రేక్షకాదరణ పొందాలని కోరుకుంటున్నా. ఈ సమ్మర్ అంతా డ్రైగా ఉంది. నెలకు కనీసం రెండు మీడియం, చిన్న సినిమాలు ఆదరణ పొందితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. అందరికీ ఉపాధి దక్కుతుంది. “గం..గం..గణేశా” తో మేమొక మంచి సినిమా చేశాం. ఔట్ పుట్ తో హ్యాపీగా ఉన్నాం. మీరు థియేటర్ కు వెళ్లి సినిమా చూడండి. నచ్చితే మిగతా వారికి చెప్పండి. ఇది నా ఒక్కడి సినిమా కాదు ఎన్నో క్యారెక్టర్స్ బాగుంటాయి. యూనిక్ ప్రెజెంటేషన్ తో మూవీ ఉంటుంది. రశ్మిక గారితో పాటు మా టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న మాట్లాడుతూ – “గం..గం..గణేశా” ఈ టీమ్ అందరికీ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. మనకంటూ ఒకరి సపోర్ట్ ఉండాలి. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక నేను అది ఫీలయ్యాను. ఆనంద్ నాకు ఒక బ్రదర్. అతనికి తెలియదు అతని మీద నేను చాలా డిపెండ్ అవుతుంటా. ఈ సినిమా సక్సెస్ అందుకుంటే ఆనంద్ మొహంలో నవ్వు ఉంటుంది. ఆ నవ్వు చూడాలని కోరుకుంటున్నా. “గం..గం..గణేశా” సాంగ్స్ కు నేను డ్యాన్సులు చేశా. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ చాలా బాగుంది. డైరెక్టర్ ఉదయ్ కు ఈ సినిమా బిగ్ సక్సెస్ ఇవ్వాలి. “గం..గం..గణేశా” లో రుద్ర, ఇమ్మాన్యుయేల్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ఇమ్మాన్యుయేల్ వీడియోస్ చూస్తే నవ్వు ఆగదు. ప్రొడ్యూసర్స్ వంశీ, కేదార్, అనురాగ్ కు ఈ సినిమా లాభాలు తీసుకురావాలి. బేబి మూవీ చూశాక సాయి రాజేశ్ గారి డైరెక్షన్ లో తప్పకుండా నటించాలని అనిపించింది. అన్నారు.

నటీనటులు :
ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, రాజ్ అర్జున్, తదితరులు.

టెక్నికల్ టీమ్ :

పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
కాస్ట్యూమ్ డిజైనర్ : పూజిత తాడికొండ
ఆర్ట్: కిరణ్ మామిడి
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి
సంగీతం – చేతన్ భరద్వాజ్
లిరిక్స్ – సురేష్ బనిశెట్టి
బ్యానర్ – హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్
కొరియోగ్రఫీ: పొలాకి విజయ్
కో-ప్రొడ్యూసర్ -అనురాగ్ పర్వతనేని
నిర్మాతలు – కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి
రచన, దర్శకత్వం – ఉదయ్ శెట్టి

Latest Articles

సీఎంతో సినీ ప్రముఖుల భేటీలో కీలక అంశాలు

సీఎంతో సినీ ప్రముఖుల భేటీలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. బౌన్సర్ల అంశాన్ని ప్రత్యేకంగా సీఎం రేవంత్ ప్రస్తావించారు. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించిన వీడియోను సినీ ప్రముఖులకు చూపించారు ముఖ్యమంత్రి రేవంత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్