Visakha Steel Plant | విశాఖ స్టీల్ ప్లాంట్ వర్కింగ్ కేపిటల్, ముడిసరుకు కోసం బిడ్ దాఖలు చేసేందుకు గడువు నేటితో ముగియనుంది. నేడు చివరి రోజు కావడంతో తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేస్తుందా లేదా అన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది. అయితే ఇప్పటివరకు బిడ్డింగ్ లో 22కంపెనీలు పాల్గొన్నాయి. మరోవైపు, ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఐతే ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థలు బిడ్ వేయలేదు. బిడ్ వేసేందుకు ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది. దీంతో ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది.