ల్యాప్‌టాప్‌లు దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును విశాఖలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ క్రైం పోలీసులు రట్టు చేశారు. తమిళనాడుకు చెందిన గణేష్ శంకర్, మంజునాథ్‌లను వారు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి లక్షా 50 వేల రూపాయల విలువైన 6 ల్యాప్‌టాప్‌లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దొంగిలించిన ల్యాప్‌టాప్‌లను తమిళనాడులో విక్రయి స్తున్నట్లు ద్వారక సబ్ డివిజన్ క్రైమ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. మహారాష్ట్ర, ఏపీలోని విశాఖతో పాటు పలు చోట్ల వీరు ల్యాప్‌టాప్‌లు చోరీ చేస్తున్నట్లు చెప్పారు.


