యంగ్ హీరో విక్రాంత్ కథానాయకుడిగా నటిస్తోన్న భారీ బడ్జెట్ ప్రెస్టీజియస్ మూవీ ‘స్పార్క్L.I.F.E’. మెహరీన్ ఫిర్జాదా, రుక్సర్ థిల్లాన్ హీరోయిన్స్. విక్రాంత్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి ‘హృదయం’ ఫేమ్ హేషం అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళ విలక్షణ నటుడు గురు సోమసుందరం విలన్‌గా నటించారు.
రీసెంట్‌గా ‘స్పార్క్L.I.F.E’ షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు మేకర్స్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేయటంలో బిజీగా ఉంది. ఎమోషన్స్, లవ్, భారీ యాక్షన్స్ సీక్వెన్సులతో రూపొందుతోన్న ఈ సినిమాలో సినిమాటోగ్రపీ, సంగీతం, నేపథ్య సంగీతం హైలైట్‌గా నిలవనున్నాయి.
పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మూవీని నవంబర్ 17న రిలీజ్ చేయనున్నారు. విక్రాంత్, మెహరీన్ పిర్జాదా, రుక్సర్ థిల్లాన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో నాజర్, సుహాసిని, మణిరత్నం, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, చమ్మక్ చంద్ర, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మతదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.