Viral News: ఏవైనా టూరిస్ట్ స్పాట్ లకు వెళ్లినప్పుడు అక్కడ కొన్ని రకాల జంతువులను చూస్తూ ఉంటాం. అయితే వాటికి రక్షణ కవచాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఏదైనా వాహనంలో లేదా.. నడిచి వెళ్తున్నప్పుడు సడన్ గా జంతువులు ఎదురైతే మాత్రం ఒక్కసారిగా టెన్షన్ మొదలవుతుంది. మనకు ఈరోజే ఆఖరి రోజనే ఆలోచనలు మొదలవుతాయి. కాని కొన్ని సందర్భాల్లో కొంతమంది తమ తెలివి ఉపయోగించి జంతువుల బారీ నుంచి తప్పించుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఆ జంతువులకు మాంసంగానూ మారుతూ ఉంటారు. అందుకే జంతువులు ఉంటాయని తెలిస్తే ఆచోటకి వెళ్లకుండా ఉండటమే మంచిదనుకుంటాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కొన్నిసార్లు మనకు జంతువులు కనిపిస్తూ ఉంటాయి. చిన్న చిన్న జంతువులైతే.. వాటినే మనం భయపెడతాం. అదే గజరాజులు అయితే.. అవి మనల్ని క్షమించి వదిలేయాలే తప్ప.. వాటినుంచి తప్పించుకునే వేరు మార్గం ఉండదు.
ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతోంది. కొంతమంది బస్సులో తీర్థ యాత్రకు వెళ్లి.. తిరిగి వస్తుండగా.. వారికి మార్గ మధ్యలో ఏనుగు కన్పించింది. ఇక అంతే బస్సులో వారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆ ఏనుగు బస్సుకు మరింత దగ్గరగా వస్తున్నకొద్ది బస్సులో వారంతా చాటా టెన్షన్ పడుతున్నారు. ఇక చేసేదేమి లేక వారంతా భారం భగవంతుడిపై వేసి.. వినాయక మంత్రం పఠించారు. బస్సులో వారంతా మంత్రం జపించగా.. ఆ ఏనుగు సైతం శాంతించి.. ఆ బస్సుకు దారిచ్చింది. దీంతో గజరాజును దాటుకుని ఆ ప్రయాణీకులతో ఉన్న బస్సు ముందుకు కదిలింది. ఇంతకీ ఆ వీడియో ఎక్కడ తీశారనేదానిపై క్లారిటీ లేకపోయినప్పటికి.. గజరాజు రహదారిపై ప్రత్యక్షం కావడంతో ప్రయాణీకులు మాత్రం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరికి ఆ ఏనుగును తప్పించుకుని బస్సు ముందుకెళ్లడంతో.. ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోను ఇండియన్ పోలీస్ సర్వీస్- IPS అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
😜
When a car full of #Brahmins meet a wild #Elephant 😄😄😜@susantananda3 @ParveenKaswan @SudhaRamenIFS @hvgoenka pic.twitter.com/75lQQuVOWE
— Rupin Sharma IPS (@rupin1992) March 26, 2023