సినీ హీరో విక్టరీ వెంకటేష్ రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు మయూరి సెంటర్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్డు వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు కొత్తగూడెం క్లబ్‌లో జరిగే ప్రముఖుల సమ్మేళనానికి వెంకటేశ్ హాజరవుతారు.


