Vidudhala Part 1 Trailer| ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వం వహించిన విడుదలై-పార్ట్1 చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, కమెడియన్ సూరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ విడుదల-పార్ట్1(Vidudhala Part 1) పేరుతో రిలీజ్ చేయనుంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ చివర్లో మనిషి పుట్టగానే.. ఒకరు పైన.. ఒకరు కింద.. మరొకరు ఇంకా కింద అని వేరు చేసే మీరు వేర్పాటువాదులా? లేదు మనుషులు అందరూ సమానమే అని చూసే మేము వేర్పాటువాదులమా? అని ప్రశ్నిస్తున్న డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 15న తెలుగులో ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఇటీవల ఈ సినిమాను తమిళంలో చూసిన సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్ర యూనిట్ ను మెచ్చుకున్నారు. తమిళ పరిశ్రమలో ఇంతవరకు ఇలాంటి కథను తమిళ సినిమాల్లో చూడలేదని ప్రశంసించారు. ముఖ్యంగా విజయ్ సేతుపతి, సూరి నటన అద్భుతంగా ఉందంటూ రజినీ కొనియాడారు.
Read Also: రూ. 11 వేల కోట్లతో తెలంగాణ అభివృద్ధి: ప్రధాని మోదీ
Follow us on: Youtube, Instagram, Google News