23.7 C
Hyderabad
Wednesday, July 2, 2025
spot_img

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న కూరగాయల ధరలు

     రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యవసర సరుకులకు తోడు, పెరిగిన కూరగాయల ధరలు సామన్యులకు భారంగా మారుతున్నాయి. ఎండాకా లంలో సాధారణంగా కూరగాయల ధరలు పెరగడం చూస్తుంటాం. కానీ, ఈసారి భిన్నంగా పరిస్థితి మారింది. అసలు కూరగాయల ధరల పెరగడానికి కారణం ఏంటి.?. అమాంతం పెరిగిన ధరలపై వ్యాపార వర్గాలు ఏం చెబుతున్నాయి..? పెరిగిన ధరలతో సామాన్య ప్రజల ఏమంటున్నారు.?

   తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షలకు వ్యవసాయ పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. వాటి ప్రభావం ఇప్పుడు కూరగాయల మార్కెట్‌లో కనిపిస్తోంది. సాధారణంగా ఎండాకాలంలో అత్యధిక ఎండలతో కొన్ని రకాల కూరగాయల పంటలు దెబ్బతినడంతో ధరలు పెరగ డం కనిపిస్తోంది. కాని గతంతో పోల్చితే కొంత ఈయేడు సాధారణం కన్నా ఎక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. వాటి భయానికి కొందరు రైతులు మోతాదు స్థాయిలో పంటలు సాగుచేయగా, కొన్ని కూరగా యల పంటలు వడగండ్ల వానలతో పూత రాలడం, కురిసిన వర్షలకు తెగులు సోకడంతో రైతులు దిగు బడి రాక నష్టపోయారు. దీంతో కూరగాయల ధరల మీద ప్రభావం పడింది.

   కూరగాయల ధరలు చూసి ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. సాధారణ సమయంలో వారానికి సరి పడా కూరగాయలు కొనుగోలు చేస్తే ఐదు వందల రూపాయలు మార్కెట్‌కి తీసుకెళ్తే సరిపోయేవని. కాని ప్రస్తుతం ఆ డబ్బుతో సగం కూరగా యలు కూడా రావడం లేదని జనం వాపొతున్నారు. ఇక మార్కెట్‌ లో ఉన్న ధరలను పరిశీలిస్తే మాత్రం కిలో పచ్చిమిర్చి 120 రూపాయలు ధర పలుకగా, రిటైల్‍ దుకాణంలో మాత్రం 150 రూపాయల వరకు అమ్ముతున్నారు. బీరకాయ 80 నుంచి 90 రూపాయలు, టమోటా 80 రూపాయలు అముత్తున్నారు. ఇక బహిరంగ మార్కెట్‌లో మాత్రం 90 రూపాయ లకు పైనే చెబుతున్నారు. మునగకాయలు 160, ఉల్లిగడ్డ రెండు వారాల క్రితం 100 రూపాయలకు నాలుగు కిలోలు అమ్మకం జరిగా యి. ప్రస్తుతం రెండు కిలోలు మాత్రమే వస్తోందని జనం వాపోతున్నారు. వెల్లుల్లి మాత్రం వాటి క్వాలిటీని బట్టి 250 రూపాయల నుంచి 300 వరకు ధర పలుకుతోంది. ఆలుగడ్డ 50, బెండకాయ 80, వంకాయ, దొండకాయ 80 రూపాయలకు ధర పెరిగింది. ఇకపోతే కొత్తిమీర కేజీ 120 రూపాయలకు పెరిగగా, పుదీనా తోపాటు ఆకు కూరల ధరలు కూడా అదే మోతాదులో పెరిగాయి. అటు నాన్‍ వెజ్‌తో మొదలుకొని వెజ్‍ వరకు ప్రతి కూరలో ఉల్లిపాయలు లేనిది దాదాపుగా కూర వండలేని పరిస్థితి. దీంతో అరకోరగా కోనుగోలు చేసి సర్దుకుంటున్నామని చెబుతున్నారు.

    కూరగాయల డిమాండ్‌కు సరిపోను సరఫరా లేకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకో వడంతో రవాణా చార్జీలు పెరుగుతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. వాటిలో కూడా కొంత మేర కూరగాయలు పాడైపోతున్నాయని చెబుతున్నారు. మరోవైపు జనం మాత్రం చేసేది ఏం లేక కూరగాయలు కోనేది తప్పక తక్కువ పరిమాణంలో కోనుగోలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో అరకోర జీతాలతో బతుకు బండి లాగుతున్నవారు, ఇంటి రెంటు, కరెంటు బిల్లులు, ఈఎంఐలు కట్టడానికే తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. దీంతో పెరిగిన కూరగాయల ధరలతో చచ్చి బతుకుతున్నా మంటున్నారు. ప్రతి నెల రోజులకు సరిపోయే కూరగాయలకు జీతంలోని కొంత భాగం తీసిపెట్టుకోగా, ఆ డబ్బు ఇప్పుడు ఉన్న ధరలతో మార్కెట్‍ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడుతున్నారు. మరో పక్క రైతు బజార్లు ఉన్న చోట కొంత మేర ధరలు మేలు ఉంది. కాని మార్కెట్‍లు అందుబాటులో లేని ఏరియాలల్లో మాత్రం అదనంగా పది రూపాయల లాభం తో అమ్ముతున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‍ నగరంలో ప్రైవేటు హస్టల్స్, బిజినెస్‍ వేరీ కాంపిటిషన్‌తో నడుస్తుం టాయి. ప్రస్తుతం కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడం తో, హస్టల్స్‌లో ఉండే వారి సంఖ్యకు సరిపోను కూరగాయలు కొనాలన్నా, సరైన భోజనం అందించక పోయినా, హాస్టల్‍ మారుతారని భయంతో ఎక్కువ ధరలు ఉన్నా కూరగాయలు కొనుగొలు చేస్తున్నామని అంటున్నారు హాస్టల్ నిర్వాహకులు. పెరిగిన కూరగాయల ధరలు ఇలాగే కొనసాగితే మాత్రం హాస్టల్‍ బిజినెస్‍ పూర్తిగా పడిపోతుందని అంటున్నారు. అలాగే హోటల్స్, రోడ్‍ సైడ్‍ నిర్వహించే చిన్న చిన్న ఫుడ్‍ సెంటర్ల మీద కూడా దీని భారం పడుతుందని అంటున్నారు. కూరగాయల ధరలు పెరగడంతో జనం ఒకవైపు అవసరానికి సరిపడా కూరగాయలు కొనుగోలు చేయకుండా అరకొరగా కొనుగోలు చేసి సర్దుకుం టున్నారు. మరోవైపు పెరిగిన ధరలతో వ్యాపారులు సైతం మోతాదులో కూరగాయలను మార్కెట్‌లో అమ్ముతున్నారు. ప్రస్తుత ధరలతో అమ్ముడు పోక లాభాలు కూడా ఆశించిన స్థాయిలో లేవని వాపొతు న్నారు. మరోపక్క మార్కెట్‌నే నమ్ముకొని బతికే హమాలీలకు, ఆటోవాలాలకు పెద్ద మొత్తంలో కూరగా యలు మార్కెట్‌కి రాకపోవడంతో పని సైతం దోరకడం లేదంటున్నారు. పెరిగిన కూరగాయల ధరలు ఇలాగే కొనసాగితే మాత్రం పచ్చడి మెతుకులే దిక్కు అని జనం అంటున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్