- అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఐకేఆర్ దంపతులు
- భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని విస్తృత ఏర్పాట్లు

నిర్మల్ జిల్లా బాసరలో వసంత పంచమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన చిన్నారులకి అక్షర అభ్యాస పూజలు జరిపారు. ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున మహాకాలి, లక్ష్మి, సరస్వతి అమ్మ వార్లకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్‌లలో పాలు, బిస్కెట్లు, మంచినీరు అందించారు.
