21.2 C
Hyderabad
Tuesday, February 11, 2025
spot_img

Varun Tej -Lavanya Tripathi: వివాహ బంధంతో ఒక్కటైన వరుణ్ తేజ్- లావణ్య..

స్వతంత్ర వెబ్ డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి(Varun Tej-Lavanya Tripathi) ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇటలీ(Italy)లో వీరి వివాహం(marriage) వేద మంత్రాల సాక్షిగా అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాలతో పాటు బంధువులు, స్నేహితుల సమక్షంలో లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేశాడు వరుణ్ తేజ్. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి.

కొత్త జంట తొలి ఫోటో సోషల్ మీడియా(Social Media)లో హల్ చల్ చేస్తోంది. వరుడు వరుణ్ తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో అతను మరియు లావణ్య త్రిపాఠితో ఉన్న అనేక చిత్రాలను పంచుకున్నాడు. ఆమె పట్ల తనకున్న ప్రేమను తెలుపుతూ తెల్లటి హార్ట్ ఎమోజితో క్యాప్షన్‌లో, “మై లవ్!” అని రాశాడు. బుధ‌వారం రాత్రి వరుణ్ తేజ్-లావణ్య(Varun Tej-Lavanya Tripathi) ఒక‌రి త‌ల‌పై మ‌రొక‌రు జీల‌క‌ర్ర‌-బెల్లం పెట్టారు. తర్వాత లావ‌ణ్య మెడ‌లో మూడు ముళ్లు వేశాడు వరుణ్ తేజ్.పెళ్లి తర్వాత కొత్త జంట అందరికీ నమస్కారం చేస్తున్న ఫొటోను నాగ బాబు(Nagababu) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అభిమానులు సహా అందరూ కొత్త జంటను ఆశీర్వదించాలని కోరారు. వీటితో పాటు పెళ్లి మండపంలో పవన్ కల్యాణ్ ఉన్న ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇవి చూసి ఫ్యాన్స్.. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.

కొత్త జంట ముందుగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వధూవరులు ఇద్దరూ తమ తమ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని జీవితం ప్రారంభించారు. పెళ్లి తర్వాత అక్కడే రిసెప్షన్ కూడా మొదలైంది. వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి పెళ్లికి సుమారు 120 మంది అతిథులు హాజరైనట్లు తెలిసింది. ఇరు కుటుంబాలు, బంధు మిత్రులతో పాటు చిత్రసీమ నుంచి అతికొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. 

చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసన(Ram Charan, Upasana) దంపతులు & అల్లు అర్జున్ స్నేహా రెడ్డి(Allu Arjun Sneha Reddy) దంపతులు ఈ వివాహ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్, సుస్మితా కొణిదెల, నిహారిక… మెగా కజిన్స్ అందరూ అటెండ్ అయ్యారు. ఇక వీరి వివాహ విందు ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే మెహందీ, హ‌ల్దీ వేడుక‌ల‌కు సంబంధించిన ఫోటోలు చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఇప్పుడు పెళ్లి ఫొటోలు షేర్ చేస్తూ విష్ చేస్తున్నారు.  వివాహానికి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించడంతో సిటీలో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నవంబర్ 5న జరగబోయే ఆ వేడుకకు ఆల్రెడీ ఆహ్వానాలు కూడా పంపారు. కార్ పాస్ కూడా ఇవ్వడం విశేషం.

ఇటలీలోనే మొదలై

ఎన్నో ఏళ్లుగా వరుణ్-లావణ్య ప్రేమలో ఉన్నారు. అయితే ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచి ఇటీవలే అభిమానులతో పంచుకున్నారు. వరుణ్-లావణ్య (Varun Tej-Lavanya Tripathi)కలిసి ‘మిస్టర్’ సినిమాలో జంటగా నటించారు. 2017లో వచ్చిన ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఇక తర్వాత అది ప్రేమగా మారింది. అయితే ఈ షూటింగ్ కూడా ఇటలీలోనే జరగడం మరో విశేషం. ఇక వీరి ప్రేమకి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపి ఆశీర్వదించారు. దీంతో ప్రేమ పక్షులు రెండు పెళ్లి బంధంతో ఒకటయ్యాయి.

ఇక హనీమూన్ కూడా ఇటలీలోనే జరుపుకోవాలని వరుణ్-లావణ్య డిసైడ్ అయ్యారు. దీంతో పెళ్లి వేడుకలు ముగిసిన తర్వాత ఇరు కుటుంబాలు ఇండియా చేరుకుంటాయి. వరుణ్-లావణ్య మాత్రం యూరోప్ మొత్తం తిరిగి తర్వాత భారత్ చేరుకోనున్నారు. ఆ తర్వాత తిరిగి తన కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని వరుణ్ నిశ్చయించుకున్నాడు. అలానే వచ్చిన తర్వాత తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్'(Operation Valentine’) ప్రచార కార్యక్రమాల్లో మెగా ప్రిన్స్ పాల్గొంటాడు. ప్రస్తుతానికి అయితే కొద్ది రోజుల పాటు సినిమాలకి ఇద్దరూ లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నారన్నమాట.

Latest Articles

పరుగులు పెడుతున్న పసిడి ధర – వెంటనే వెళుతున్న వెండి ధర

ఆగవమ్మా.. ఆగు.. అని ఎంత వెంట పరుగులు పెడుతున్నా.. మెయిల్, ఎక్స్ ప్రెస్ రైలు మాదిరి పరుగెడుతున్న బంగారం ధర ను ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. పరుగుల రాణులు, రన్నింగ్ రాజులు.. నీ సువర్ణ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్