స్వతంత్ర, వెబ్ డెస్క్: మెగా కుటుంబంలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచిన వరుణ తేజ్, లావణ్య త్రిపాఠీ వివాహం గురించి అఫీషియల్ ప్రకటన విడుదలైంది. రేపు జూన్ 9వ తేదీన వీరి ఎంగేజ్ మెంట్ జరగనున్నట్టు ఒక గ్రీటింగ్ కార్డు ట్వీట్ వైరల్ అవుతుంది. ”TWO HEARTS ONE LOVE”.. ఇద్దరూ జీవితాంతం హ్యాపీగా ఉండాలని విషెస్ తెలియయజేస్తూ.. ఓ గ్రీటింగ్ కార్డును సినీ వర్గాలు ట్వీట్స్ చేస్తున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ వరుణ్‌కి విషెస్ చెబుతున్నారు.
వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడంటూ ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. మిస్టర్, అంతరిక్షం సినిమాల సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది. లావణ్య పుట్టినరోజును సెలబ్రేట్ చేసేందుకే వరుణ్ తేజ్ బెంగళూరు వెళ్లాడంటూ ఆ సమయంలో వార్తలు వచ్చాయి. అక్కడే ఆమెకు ప్రపోజ్ చేశాడంటూ మరో వార్త వచ్చింది. ఈ వార్తలపై మెగా కుటుంబం నుంచి ఎవరూ స్పందించలేదు. ఆ తరువాత ఈ విషయంపై లావణ్య త్రిపాఠి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నానంటూ అక్కడి ఫోటోలను షేర్ చేయడంతో అప్పుడు ఏ వార్తలకు బ్రేక్ పడింది.
ప్రస్తుతం ఈ ఎంగేజ్ మెంట్ కార్డ్ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెగా అభిమానులు, నెటిజన్లు కంగ్రాట్స్ తెలుపుతున్నారు. మరి ఈ కార్డ్ ఒరిజినలా.. లేదా ఫేకా అని తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ పోస్ట్ మెగా ఫ్యామిలిలో ఏ ఒక్కరు షేర్ చేయలేదు. కానీ నెట్టింట్లో మాత్రం తెగ వైరల్ అవుతోంది.