స్వతంత్ర వెబ్ డెస్క్: ఇంగ్లండ్ లెజెండరీ బౌలర్ స్టువార్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలకడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. ప్రపంచంలోని గొప్ప బౌలర్లలో ఒకడైన అతను యాషెస్ ఐదో టెస్టుతో ఆటకు గుడ్ బై చెప్పేస్తున్నాడు. ఈ సందర్భంగా భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. బ్రాడ్‌కు గుడ్ లక్ చెప్తూ యూవీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘అత్యద్భుతమైన టెస్టు కెరీర్ ఉన్నందుకు నీకు కంగ్రాట్స్. టెస్టు క్రికెట్‌లో ప్రపంచంలోని గొప్ప బౌలర్.
నిజంగా నువ్వు ఒక లెజెండ్. ఇన్నేళ్ల నీ ప్రయాణం, ఆటపట్ల నీ అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకం. తర్వాతి జీవితానికి గుడ్ లక్ బ్రాడీ’ అని తన ట్వీట్‌లో యువరాజ్ రాసుకొచ్చాడు. బ్రాడ్ వీడ్కోలు నిర్ణయం ప్రకటించే సమయంలో యువరాజ్ సింగ్‌ను గుర్తు చేసున్నాడు. 2007 టీ20 వరల్డ్ కప్ లో తన బౌలింగ్‌లో యూవీ ఆరు సిక్స్‌లు కొట్టడం మర్చిపోలేనని, అదొక చేదు జ్జాపకమని అన్నాడు. యూవీ సిక్సర్ల తర్వాతే తాను పాపులర్ అయ్యానని బ్రాడ్ తెలిపాడు.