స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ‘గబ్బర్‌సింగ్’ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కలయికలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రం తెరకెక్కుతన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘గబ్బర్ సింగ్’ విడుదలై నేటికి 11 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసింది చిత్ర యూనిట్. పాతబస్తీ పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో నటిస్తున్న పవన్ తెలంగాణలో యాసలో అదరగొట్టాడు. ‘ఈసారి పెర్ఫామెన్స్ బద్దలై పోద్ది’ అంటూ చివరలో పవన్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


