స్వతంత్ర, వెబ్ డెస్క్: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏజెంట్ లు నా మీద బురద జల్లుతున్నారని అన్నారు. యూజ్ లెస్ ఫెల్లో పవన్ కళ్యాణ్… బీసీలు, కాపులు నిన్ను ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటుంటే నువ్వు ఏంటి మాటలు రాని చంద్రబాబు కొడుకును సీఎం చేస్తానని ఎలా అంటావు? అని ప్రశ్నించారు. నేను జగన్ పొత్తు పెట్టుకుంటే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడని వ్యాఖ్యానించారు. నేను కెసీఆర్ పొత్తు పెట్టుకుంటే బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో గెలుస్తారా? అని ప్రశ్నించారు. నేను బీజేపీ తో పొత్తు పెట్టుకుంటే నాకు మంత్రి పదవి వచ్చేది. నేను ప్యాకేజ్ స్టార్ కాదని అన్నారు.
కర్ణాటక లో మేము పోటీ చేస్తే కాంగ్రెస్, జేడీఎస్ ఓట్లు చీలి బీజేపీ గెలుస్తుందని మేము అక్కడ పోటీ చేయలేదు.. అందుకే బీజేపీ ఓడిపోయిందని అన్నారు. చంద్రబాబు హయాంలో నే వివేక నంద రెడ్డి హత్య జరిగిందని.. ఆ సమయంలో చంద్రబాబు ఎందుకు పోలీస్ ఇన్ వేస్టిగేషన్ చేయించలేదని ప్రశ్నించారు. సీబీఐ చంద్రబాబును ఎందుకు ఇన్ వెస్టిగేషన్ చేయటం లేదు.ఎర్రం నాయుడు, బాషాను ఎలా చంపారో తెలుసుకొండి అని సీబీఐ వాళ్లకు చెప్పాను.. అందుకే చంద్రబాబు భయపడి ఆంధ్ర ప్రదేశ్ కు సీబీఐ రాకుండా అడ్డుకున్నారని అన్నారు.
చంద్రబాబుకు కొంత మంది జడ్జిలు ఆయన తోత్తులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి మీద విచారణ చేయాలి. అవినీతి కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడైనా ఉందా.. డబ్బులు ఇచ్చి రేవంత్ రెడ్డి పీసీసీ తెచ్చుకున్నాడు..సీనియర్ కాంగ్రెస్ నాయకులను కాదని ఓటు నోటుకు దొంగ రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఎలా ఇస్తారు? అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఒక్క శాతం ఓట్లు అయిన ఉన్నాయా… మాకు 60 శాతం ఓట్లు ఉన్నాయి. Rs ప్రవీణ్ కుమార్, షర్మిల రండి నాతో కలిసి రండి మిమ్మల్ని ఎమ్మెల్యే ఎంపీ లు చేస్తాను అంటూ హితవు పలికారు. చంద్రబాబు ఎంత మూర్ఖుడో ఎన్టీఆర్ మాటలు వినండి అంటూ ఎన్టీఆర్ వీడియో చూపించారు.


